తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హవ్వా.. సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఆశ్లీలం.. డ్యాన్సులతో హోరెత్తించి..

|
Google Oneindia TeluguNews

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించాడు. ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. మంచి పనులు చేయాలి. కానీ గెలిచిన ఆనందంలో తానో ఒక ప్రజాప్రతినిధి అనే సంగతే మరిచిపోయాడు. అసాంఘిక కార్యకలాపాలకు తెర తీశాడు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సంతోషంలో గ్రామస్థులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు సర్చంచ్. అయితే అందులో ఆశ్లీల డ్యాన్స్ చేయడం కలకలం రేపింది.

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామ సర్పంచ్‌ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. గెలిచిన ఆనందంలో పార్టీ ఇచ్చారు. అయితే మహిళలతో రికార్డింగ్‌ డాన్స్‌ ఏర్పాటు చేశారు. దీంతో మిగతా వారు ఆశ్చర్యపోయారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా అమ్మాయిలతో ఆశ్లీలంగా డ్యాన్స్ నిర్వహించడం చర్చకు దారితీసింది. గ్రామ ప్రథమ పౌరుడే ఇలా చేస్తే ఎలా అని చాలా మంది అంటున్నారు. అప్పుడే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Recording Dance in Sarpanch Swearing Ceremony

గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మారుస్తామని హామీ ఇచ్చాడు. అంతలోనే ఆ మాట ఆవరయిపోయింది. వేదికపైనే అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై గ్రామస్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదేం పని.. ఇప్పుడే మాట ఇచ్చి.. అప్పుడే విస్మరిస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదీ మంచి పద్దతి కాదని.. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని కోరుతున్నారు.

English summary
Recording dance at the village sarpanch swearing in ceremony at east godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X