తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిందూ ఆలయాలంటే లెక్కలేదా.. పురాణాలు తెలియదా..?, మీ పాలసీ ఏంటీ..జగన్‌పై రఘురామ..

|
Google Oneindia TeluguNews

అంతర్వేది ఆలయ ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని సీఎం జగన్‌ను వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. రథాన్ని తగులబెట్టినవారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ఈ సారి బౌద్దారామంపై: ఏపీ సర్కార్‌పై నిప్పులు, విశాఖ తొట్లకొండను రక్షించుకోవాలి: ఎంపీ రఘురామఈ సారి బౌద్దారామంపై: ఏపీ సర్కార్‌పై నిప్పులు, విశాఖ తొట్లకొండను రక్షించుకోవాలి: ఎంపీ రఘురామ

 రెండు ఆలయాలకే ఒకరే ఈవోనా.. ఆలయాలంటే లెక్కలేదా

రెండు ఆలయాలకే ఒకరే ఈవోనా.. ఆలయాలంటే లెక్కలేదా

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ప్రమాదం కుట్ర అని ఎంపీ రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఆలయాలకు కలిపి ఒకే ఈవోను నియమిస్తారా అని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలంటే లెక్కలేదా అని మండిపడ్డారు. హిందూ పురాణాలు తెలియవు.. మీ పాలసీ ఏంటి అని జగన్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఒక మతంపై దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

సీసీ కెమెరాలు పనిచేయలేదు..

సీసీ కెమెరాలు పనిచేయలేదు..

అంతర్వేదిలో సీసీ కెమెరాలు పనిచేయలేదు అని.. ఎందుకు ఆ సమయానికి పనిచేయలేదు అని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పడం తప్పా అని అడిగారు. కానీ సహచర మంత్రులకు మాత్రం వారు ఎర్రివారిలాగా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. రథం ప్రమాద ఘటనపై దేవాదాయ శాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడం సరికాదని రఘురామ మండిపడ్డారు

గోరుముద్ద పథకం పేరు మార్చి..

గోరుముద్ద పథకం పేరు మార్చి..

సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంపై కూడా రఘురామకృష్ణరాజు స్పందించారు. గోరుముద్ద పథకానికే సంపూర్ణ పోషణ అని పేరుపెట్టారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రావాలంటే ప్రభుత్వ ప్రకటనల్లో కేంద్రం పేరు కూడా చేర్చితే బాగుండేదని ఆయప సూచించారు. ఏపీ మద్యం విధానంపైనా రఘురామ విమర్శలు గుప్పించారు. కాలం చెల్లిన బీర్లు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఫైరయ్యారు. డేట్ అయిపోయిన బీర్లకు మళ్లీ పరీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చి బ్రాండ్ల మద్యాన్ని తొలగించాలని కోరారు.

English summary
why not prioroty to hindhu temples, ysrcp rebel mp raghurama krishna raju asked andhra pradesh government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X