ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏలూరు వింత వ్యాధి .. బాధితుల కనుగుడ్లలో తేడాలపై అధ్యయనం .. ఒకరి నుండి ఒకరికి వచ్చేది కాదన్న నిపుణులు

|
Google Oneindia TeluguNews

ఏలూరులో ప్రబలుతున్న వింత వ్యాధి ఇప్పుడు ఏలూరు వాసులలో అలజడి రేపుతోంది. వందల సంఖ్యలో పెరుగుతున్న కేసులతో , ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందా అన్న అనుమానం ఏలూరు వాసులలో భయాందోళనకు కారణమౌతుంది. ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం, వైద్య నిపుణులు ఈ వ్యాధి ఏంటి అనేది తేల్చలేకపోయారు కానీ ఏలూరులో ప్రబలుతున్న ఈ వింత వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది కాదని మాత్రం వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు . ఇదే సమయంలో బాధితుల కనుగుడ్ల తేడాపై అధ్యయనం చేస్తున్నారు.

ఒకరి నుండి ఒకరికి వ్యాపించే వ్యాధి కాదని తేల్చిన వైద్యులు

ఒకరి నుండి ఒకరికి వ్యాపించే వ్యాధి కాదని తేల్చిన వైద్యులు

ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే జబ్బు కాదు అని మాత్రంవైద్య నిపుణులు చెబుతున్నారు. డైరెక్టుగా మెదడుకు సంబంధించిన నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్స్ చూపిస్తూ బాధితులకు నోటి నుండి నురగలు రావడం, ఫిట్స్ రావడం వంటి లక్షణాల నేపథ్యంలో ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండదు అని అంచనా వేస్తున్నారు. వాంతులు, విరోచనాలు, నోటి నుండి నురగలు వస్తూ ఫిట్స్ మాత్రమే లక్షణాలుగా ఉన్న ఈ వ్యాధి తీసుకునే ఆహార పదార్థాల వలన, పాలు, నీళ్ల వలన వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే జ్వరం , ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయన్న వైద్యులు

వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే జ్వరం , ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయన్న వైద్యులు

వైరల్ , బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సంబంధిత జబ్బులు అయితే జ్వరం ఒళ్లునొప్పులు తలనొప్పి ఇలాంటి లక్షణాలు వస్తాయని,అలా ఎలాంటి లక్షణాలు లేకుండాడైరెక్టుగా ఫిట్స్ రావడంతోఇది ఒకరినుంచి ఒకరికివ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్ కాదనితేలింది. ఇది ఏలూరు వాసులకు ఒకింత ఊరట కలిగించే అంశం. ఇది మాస్ హిస్టీరియాకుసంబంధించినసమస్య కూడా కాదని అంచనా వేస్తున్నారు . మాస్ హిస్టీరియా అనేది ఒక మానసిక వ్యాధి. వారు కూడా సడన్ గా పడిపోయి మూర్చ వంటి లక్షణాలతో వింతగా ప్రవర్తిస్తారు . కానీ ఇది మాస్ హిస్టీరియా కూడా కాదని తేలింది .

బాధితుల కనుగుడ్లలో తేడా .. అధ్యయనం చేస్తున్న వైద్య బృందాలు

బాధితుల కనుగుడ్లలో తేడా .. అధ్యయనం చేస్తున్న వైద్య బృందాలు

ఇక ఇదే సమయంలో బాధితుల కనుగుడ్డు లో వచ్చిన తేడాలపై కూడావిశ్లేషణ సాగుతోంది.పెరిధ్రిమ్ లేదా ఆర్గానో ఫాస్పేట్వల్ల కూడా కనుగుడ్డు లో తేడాలు వస్తాయని,మెదడు సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశముందనివైద్య నిపుణులు అంటున్నారు. బాధితుల కనుగుడ్లు పరిమాణం కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తోంది అని న్యూరో టాక్సిన్స్ వల్ల ఈ తేడాలు వచ్చి ఉండొచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. పురుగు మందుల అవశేషాలు కలిసిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఇలా జరిగిందేమో అన్న అంశంపైన కూడా అధ్యయనం చేస్తున్నారు.

ఏలూరు వాసులకు టెన్షన్ టెన్షన్ ... కేంద్ర బృందాలు ఏం తేలుస్తారో?

ఏలూరు వాసులకు టెన్షన్ టెన్షన్ ... కేంద్ర బృందాలు ఏం తేలుస్తారో?

ఏదేమైనా అసలు ఏలూరు లో ఏం జరుగుతుంది..వింత వ్యాధికి కారణం ఏంటి అన్నఉత్కంఠ మాత్రం ఏలూరు వాసులకు ఇంకా కొనసాగుతుంది.ఎవరికివారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకునిగడుపుతున్న పరిస్థితి ప్రస్తుతం ఏలూరులో ఉంది. కేసుల సంఖ్యా పెరగటం వారికి ఆందోళన కలిగిస్తుంది. ఈ రోజు కేంద్ర బృందాలు రంగంలోకి దిగి అసలీ వింత వ్యాధి అంతు తేల్చే పనిలో పడ్డారు . ఈ రోజు కేంద్ర బృందాలు ఎం నివేదిక ఇస్తాయో అన్న ఆందోళన ఏలూరు వాసుల్లో వ్యక్తం అవుతుంది.

English summary
mysterious illness rampant in Eluru is now causing a stir among the people. So far, the AP govt and medical experts have made it clear that the strange disease is not contagious.At the same time the difference between the victims' eyeballs is being studied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X