• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సమంతా ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్‌కు అనూహ్య స్పందన..రెండ్రోజుల్లో 37 మిలియన్ వ్యూస్..!

అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఒరిజినల్ సిరీస్,ఫ్యామిలీ మ్యాన్ నూతన సీజన్ ట్రైలర్‌ను మే 19వ తేదీన అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. 2019వ సంవత్సరంలో మొదటి సీజన్ విడుదలైన తరువాత అది క్లిఫ్ హ్యాంగర్‌తో ముగియడంతో అభిమానులు అత్యంత ఆసక్తిగా తరువాత సీజన్ కోసం వేచి చూశారు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్‌లో కొనసాగుతోంది. వరుసగా మూడ్రోజుల పాటు ట్రెండింగ్‌లోనే ఉంది. దీంతో ఫ్యామిలీ మ్యాన్‌ పై ప్రజలు ఎంతటి ఆసక్తి కనబరుస్తున్నారో అర్థమవుతోంది.

ఇప్పటి వరకు 37 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్. ఇక ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్లు తమ ఏ-గేమ్‌ను తీసుకురావడంపై ఫోకస్ చేస్తున్నారు. దీన్ని పలు భాషల్లో తీసుకొచ్చి వీక్షకులకు సప్రైజ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ట్రైలర్ హిట్ కావడంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది ఈ షో క్రియేటర్ ద్వయం రాజ్ - డీకే. షో గురించి పలు విశేషాలు పంచుకున్నారు.

ప్రశ్న: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానులకు ఫ్యామిలీ మ్యాన్ గురించి మాకు మీరేం చెబుతారు..?

రాజ్ - డీకే: మా మనసు పెట్టి మేము ఈ సిరీస్ రూపొందించాం. సంవత్సరాల తరబడి మా కష్టం, మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి వేళలో సైతం కష్టపడి ఈ 9 భాగాల గూఢచార్య డ్రామా సిరీస్‌ను సృష్టించాం. మా వీక్షకుల ముందుకు దీనిని తీసుకురావడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము. ఈ సీజన్ కూడా ఎక్కువ మంది ఇష్టపడే శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్ ఈ పాత్ర పోషించారు)పాత్ర చుట్టూనే నిర్మించాము. మధ్య తరగతి తండ్రి, భర్తగా అంతర్గత సంఘర్షణను ఎదుర్కొంటూనే, ప్రపంచ శ్రేణి గూఢచారిగా ఫిక్షనల్ ఏజెన్సీకి ఆయన పనిచేస్తుంటాు. ఇప్పుడు శ్రీకాంత్ తివారీ ఎదుర్కొనే సవాళ్లు చాలా సంక్షిష్టంగా ఉంటాయి. అయినప్పటికీ ఆయన వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

Familyman new trailer garners 37million views on youtbe,Makers thank viewers for encouraging

ఈ సీజన్ ఖచ్చితంగా వైవిధ్యమైన భారతీయ భాషా సంస్కృతిలకు ప్రాతినిధ్యం వహిస్తుందని నమ్ముతున్నాం. ఇది అసలైన భారతీయ షో. దీనిలో సమంత అక్కినేని నటించారు. డిజిటల్ తెరపై ఆమెకు ఇది తొలి ప్రయత్నం. దీనిలో ఆమె ఓ సాహసోపేతమైన పాత్ర పోషించారు.

ప్రశ్న: ఈ సీజన్‌ను ప్రత్యేకంగా నిలిపే అంశాలేంటి..?

రాజ్ - డీకే : ఫ్యామిలీ మ్యాన్ నూతన సీజన్ ఇప్పుడు ఉత్తర - దక్షిణాలను ఒకే దరికి తీసుకువస్తుంది. సీజన్ వన్‌లోని అద్భుతమైన తారాగణంపై ఆధారపడి ఈ నూతన సీజన్‌లో తమిళనాడు థియేటర్ సర్క్యూట్ నుచంి ప్రాచుర్యం పొందిన నటులను కూడా తీసుకున్నాం. ఉద్వేగభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌తో పాటుగా ఆసక్తికలిగించే పాటలతో ఈ నూతన సీజన్ విభిన్న అభిప్రాయాలు, అత్యంత సంక్లిష్టమైన పాత్రలను సైతం సున్నితంగా స్పృశిస్తుంది.

ఈ నూతన సీజన్ కథనం ముంబై, తమిళనాడు, లండన్, ఫ్రాన్స్‌లలో వైవిధ్యమైన కథాంశంతో ముందుకు వెళ్తుంది. ఈ కథలోని సూక్ష్మ అంశాలను సైతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దడానికి మేము అనేకమంది విషయపరిజ్ఞాన నిపుణులతో కలిసి పనిచేశాం. ఇది మన కథల ద్వారా భారతీయ గొప్పదనాన్ని ప్రదర్శించడానికి మేము చేసిన ప్రయత్నాలకు జీవం పోసింది.

ఈ షోలో నటించిన తారాగణంతో పాటుగా సాంకేతిక బృందంతో సహా ప్రతి ఒక్కరూ చూపిన నిబద్ధత కారణంగా ఈ షో మరింత అద్భుతంగా రూపుదిద్దుకుంది. సీనియర్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తన పాత్రలో లీనమై నటించేందుకు తనను తాను తీర్చిదిద్దుకుంటే, తన డైలాగ్‌లను పలికేతీరులో ప్రావీణ్యం కోసం సమంత అక్కినేని ప్రత్యేకంగా తరగతులకు హాజరుకావడంతో పాటుగా మార్షల్ ఆర్ట్స్ సైతం నేర్చుకుని తన ఫైట్స్‌ను తానే చేశారు.

  ఇందుకే కదా Akkineni Samantha లేడీ సూపర్ స్టార్ అయింది ! || Oneindia Telugu

  Familyman new trailer garners 37million views on youtbe,Makers thank viewers for encouraging

  ప్రశ్న: మీ ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే ఈ నూతన సీజన్ మరింత సవాల్‌గా నిలిచిందా..?

  రాజ్‌ - డీకే : ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1కు ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వమైన స్పందన, ప్రశంసలు, ఈ సీజన్ పట్ల వారు చూపిన ప్రేమను సవినయంగా స్వీకరిస్తున్నాము. అదృష్టవశాత్తు, తరువాత సీజన్ కోసం మేము స్క్రిప్ట్‌ను ముందుగానే పూర్తిచేసుకోవడంతోపాటుగా సీజన్ 1 విడుదలకు ముందే షూటింగ్ కూడా ప్రారంభించాం. అదే ప్రేక్షకుల నుంచి భారీ అంచనాల ఒత్తిడిని తగ్గించేందుకు మాకు తోడ్పడింది. అయితే మేము ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈషోను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంతో పాటుగా ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా, షో స్వభావం, క్యారెక్టర్లు, కథాంశం ఏ మాత్రం మారకుండా రూపొందించాం. వీక్షకుల అనుభవాలను మరింతగా వృద్ధి చేసే ప్రయత్నం చేయడంతో పాటుగా ఈ యాక్షన్ డ్రామా స్పందనను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం.

  ప్రశ్న: రాబోతున్న ఈ షోతో పాటుగా రాబోతున్న ఉత్సాహంతో పాటుగానే, కొంతమంది ఈ ట్రైలర్ పట్ల తీవ్రంగా స్పందించడమూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ షోలో రాజీ పాత్ర చేసిన సమంత అక్కినేని క్యారెక్టర్ తమ మనోభావాలను గాయనిచాయంటున్నారు..

  Familyman new trailer garners 37million views on youtbe,Makers thank viewers for encouraging

  రాజ్- డీకే : ట్రైలర్‌లో కొన్ని షాట్స్ చూసే కొంతమంది కథాంశం అంచనా వూయడంతో పాటుగా తప్పుగా భావిస్తున్నారు. ఈ షోలో ప్రధాన తారాగణంతో పాటుగా క్రియేటివ్ ,రచనా బృందంతో అధఇకశాతం మంది తమిళియన్స్. తమిళ ప్రజల మనోభావాలు, వారి సంస్కృతి పట్ల మాకు బాగా అవగాహన ఉంది. మరీ ముఖ్యంగా తమిళ ప్రజల పట్ల మాకు అపూర్వమైన ప్రేమ, అంతకుమించిన గౌరవం ఉంది. ఈ షో రూపకల్పనలో ఎన్నో సంవత్సరాల కష్టం దాగా ఉంది. సీజన్ 1లో ఏవిధంగా అయితే మేము సున్నితమైన, సమతుల్యమైన, ఉత్సాహపూరితమైన కథను మా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడ్డామో అదే రీతిలో ఈ సీజన్‌ కోసమూ కష్టపడ్డాము. ఈ షో విడుదలయ్యేంత వరకూ ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాము. ఒకసారి మీరు ఈ షో చూసిన తరువాత తప్పనిసరిగా ప్రశంసిస్తారని మాకు తెలుసు.

  ఫ్యామిలీ మ్యాన్ నూతన సీజన్ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X