health tips: రాత్రుళ్ళు నిద్రపట్టక నరకంగా ఉంటుందా? సుఖవంతమైన నిద్రకోసం ఈ చిన్నచిట్కాలు ప్రయత్నించండి!!

చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసిన పడుకున్నా నిద్ర పట్టదు. ఏవేవో ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు. పరిష్కారం కాని సమస్య లాగా మంచం మీద పడుకున్న తర్వాత సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చాలామంది తమ ఆలోచన వల్ల తమ ఆరోగ్యం పాడవుతుందని, నిద్రపట్టక పోవడానికి తమ ఆలోచనలే కారణమని తెలిసినప్పటికీ వాటిపైన కంట్రోల్ సాధించలేరు. ఇక అటువంటి వారికోసం కొన్ని చిట్కాలను, వారు మనశ్శాంతిగా పడుకోవడం కోసం కొన్ని సూచనలను ఇక్కడ తెలుసుకుందాం.

నిద్రకు మూడు గంటల ముందే భోజనం .. ఎందుకంటే

నిద్రకు మూడు గంటల ముందే భోజనం .. ఎందుకంటే

బాగా నిద్రపోవాలి అనుకునేవారు ముందు రోజంతా చేసినపని తాలూకు చిరాకు నుండి మనసును రిలాక్స్ చేయాలి. అందుకు ముందుగా పడుకోవడానికి మూడు గంటల ముందే వారి భోజనం చెయ్యాలి. అప్పుడే వారికి తీసుకున్న ఆహారం జీర్ణమై నిద్ర సుఖంగా వస్తుంది. పడుకునే ముందు భోజనం చేసి పడుకుంటే ఆహారం జీర్ణం కాక, అది నిద్రకు భంగం కలిగిస్తుంది. అందుకే కచ్చితంగా పడుకోవడానికి మూడు గంటల ముందే ప్రతి ఒక్కరూ రాత్రి భోజనం పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

పడుకోవటానికి ముందు శుభ్రంగా స్నానం చెయ్యటం వల్ల కలిగే ఫలితం ఇదే

పడుకోవటానికి ముందు శుభ్రంగా స్నానం చెయ్యటం వల్ల కలిగే ఫలితం ఇదే

ఇక పడుకోవడానికి ముందు చేయవలసిన మరొక పని శుభ్రంగా స్నానం చేయడం. రాత్రివేళ కాస్త వేడి నీళ్ళతో శుభ్రంగా స్నానం చేస్తే శరీరంతో పాటు మనసు కూడా శుభ్రం అవుతుంది. దానివల్ల మనసుకు హాయి కలుగుతుంది. ఆ తర్వాత పడుకుంటే ఖచ్చితంగా మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్రపోవడానికి ముందు ప్రతి ఒక్కరు శుభ్రంగా స్నానం చేసి పడుకోడానికి ఉపక్రమించాలి. స్నానం చేసే సమయంలో మన శరీరంలోని మురికితో పాటు, మనసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు పేరుకుపోయిన అనేక ఆలోచనల మలినాలను కూడా తొలగించుకోవాలి.

దీపం వెలిగించి... ధ్యానం చెయ్యటం.. మంచి నిద్రకు మార్గం.. ఎలాగంటే

దీపం వెలిగించి... ధ్యానం చెయ్యటం.. మంచి నిద్రకు మార్గం.. ఎలాగంటే

ఇక నిద్ర పోవాలి అనుకునే వారు చేయవలసిన వరకు ముఖ్యమైన పని స్నానం చేసిన తర్వాత, మనసుని ప్రశాంతంగా ఉంచడం కోసం ఒక దీపాన్ని వెలిగించి, కాసేపు ధ్యానం చేయాలి. ఇలా ధ్యానం చేయడం వల్ల మనసు పైన మనకు పట్టు వస్తుంది. అది మన మెదడుని మనం నియంత్రించేలా చేస్తుంది. దీనివల్ల మనసులో ఉన్న చెడు ఆలోచనలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన పని తాలూకా ఒత్తిడి దూరమై సుఖవంతమైన నిద్ర పడుతుంది. అందుకే కచ్చితంగా ఒక దీపాన్ని వెలిగించి.. కానీ ఎదురుగా మంచం పైన కూర్చుని కాసేపు ధ్యానం చేయండి. ఇలా నిత్యం చేయడం వల్ల ఖచ్చితంగా మెరుగైన ఫలితం మీ నిద్ర విషయంలో వచ్చితీరుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు.

నిద్ర ఇలా పోయేలా శరీరాన్ని, మనసును రెడీ చేస్కోవాలి

నిద్ర ఇలా పోయేలా శరీరాన్ని, మనసును రెడీ చేస్కోవాలి

నిద్రకు ఉపక్రమించే ముందు చేయవలసిన మరొక పని.. పడుకున్న సమయంలో శరీరాన్ని, మనసుని అన్నిటినీ వదిలేసి, మన సమస్యలన్నింటినీ పక్కన పెట్టి, హాయిగా, ఒక జీవిగా పడుకోవటం. ఇలా పడుకోవడం మనకు మంచి నిద్రను ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఎప్పుడు పొరపాటున కూడా ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు. దీని వల్ల మెదడుకు జరిగే రక్తప్రసరణలో ఇబ్బంది తలెత్తి, అది మన నిద్రను చెడగొడుతుంది. అనారోగ్యానికి కారణం గా మారుతుంది.

 దక్షిణం వైపే తల పెట్టాలి...పడుకునే భంగిమ చూసుకోవాలి

దక్షిణం వైపే తల పెట్టాలి...పడుకునే భంగిమ చూసుకోవాలి

ఎప్పుడూ దక్షిణం వైపు తల పెట్టి, ఉత్తరం వైపు కాళ్ళు ఉండేలా పడుకోవాలి. పడుకునే భంగిమ కూడా సక్రమంగా ఉండేలా చూసుకుంటే మంచి నిద్ర పోవడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు, ఆ సమస్య నుండి బయట పడటానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం యోగా నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+