Health tips: నిత్యం ఆహారంలో అరటిపండు; బీపీ, డయాబెటిస్ రోగాలు రాకుండా హాయిగా ఉండు!!
నిజ జీవితంలో మనకు ఎప్పటికీ దొరికే అద్భుతమైన పండు అరటిపండు. ఒక్కమాటలో చెప్పాలంటే అరటిపండును అమృతఫలం అని చెబితే తప్పు కాదేమో. అంత గొప్ప పోషకాలు, మన ఆరోగ్యాన్ని కాపాడే అనేక గుణాలు అరటి పండులో పుష్కలంగా ఉన్నాయి. ఏ సీజన్లోనైనా ఎవరైనా కొనుగోలు చేయగలిగే అరటి పండులో ఉండే పోషకాలు మనల్ని అనేక వ్యాధుల నుండి కాపాడతాయి. ముఖ్యంగా బిపి, డయాబెటిస్, కండరాల సమస్యలు, నరాల సమస్యలు, గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు ఉన్నవారికి అరటి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు.

అరటిపండులో బోలెడు పోషకాలు.. అనేక రోగాలకు నివారణగా అరటి పండ్లు
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ప్రోటీన్స్, ఫైబర్ తో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండు తినడం వల్ల శరీరంలో పోషక లోపాలు నివారించబడతాయి. అరటి పండ్లను రోజూ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లోకి వస్తుంది. క్యాన్సర్ తో పాటు, గుండెజబ్బుల ప్రమాదం కూడా అరటి పండ్ల వల్ల గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం గుండె జబ్బులు ఎక్కువగా పెరుగుతున్న క్రమంలో ప్రతిరోజు అరటి పండ్లు తీసుకుంటే ఆ సమస్యను సమర్థవంతంగా నివారించ వచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

గుండె, కండరాలు, కిడ్నీలు.. అన్నిటిపైనా అరటిపండ్లతో మంచి ప్రభావం
గుండె ఆరోగ్యానికి కావాల్సిన పొటాషియం అరటి పండ్లలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి అది గుండెకు రక్షణ నిస్తుంది అని చెబుతున్నారు. మన శరీరంలో ఉండే న్యూరాన్ లకు, కండరాలకు అరటిపండు చేసేంత మేలు మరే ఇతర పండు చేయదు అంటే అతిశయోక్తి కాదేమో. కిడ్నీలలో బ్లడ్ ఫిల్టర్ కావడానికి కూడా అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అరటి పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా రాకుండా ఉంటాయని చెబుతున్నారు. అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అవి జీర్ణ వ్యవస్థ మెరుగు పడటానికి ఎంతగానో సపోర్ట్ చేస్తాయి.

డయాబెటిస్, బీపీలకు అరటిపండ్లతో చెక్
అల్సర్ లతో బాధపడేవారికి అరటి పండ్లను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది . డయాబెటిస్ రాకుండా, బీపి కంట్రోల్ లో ఉండేలా చేయగలిగిన శక్తి అరటిపండులో ఉందని చెబుతున్నారు. అధిక ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇక డయాబెటిస్ బాధితులు కూడా అరటి పండ్లను తినొచ్చు అని అయితే బాగా మిగల పండిన అరటి పండ్లను తినకూడదు అని చెబుతున్నారు. అరటి పండ్లను తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ నుండి కూడా కాపాడుకోవచ్చని, చర్మ సంబంధమైన సమస్యల నుండి కూడా బయట పడవచ్చని చెబుతున్నారు. శరీరానికి అరటిపండు నిగారింపును ఇస్తుంది అని, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అని చెబుతున్నారు.

ఆహారంలో నిత్యం అరటిపండు.. రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండు
రక్తహీనతతో బాధపడే వారు అరటి పండ్లు తింటే రక్తహీనత తగ్గుతుందని చెబుతున్నారు. ప్రతి రోజూ దొరికే అరటిపండును ఎప్పటికీ దొరికే పండే కదా అని నిర్లక్ష్యంగా చూడకుండా నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు. కాబట్టి అరటి పండు తో ఉన్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సంపన్నులే కాదు సామాన్యులు కూడా కొనుగోలు చేయగలిగిన అరటిపండును నిత్యం ఆహారంలో భాగం చేసుకోండి. అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టి ఆరోగ్యంగా జీవించండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications