health tips: మీ గుండె డేంజర్లో ఉంటే ముందే గుర్తించండి; ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చెయ్యకండి!!
భారతదేశంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న చిన్న పిల్లలు సైతం గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. చాలామంది గుండెపోటు వచ్చినప్పటికీ దానిని గుర్తించడంలో జాప్యం చేయడం వల్ల అది వారి ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడుతుంది. గుండె పోటుతో పాటు, గుండెకు సంబంధించిన అనేక సమస్యలు రావడానికి ముందు ఎటువంటి లక్షణాలు వ్యక్తులలో కనిపిస్తాయి అనేది తెలుసుకోవలసిన అవసరం ఉంది.

తరచుగా ఛాతీ నొప్పి వస్తుందా?
తరచుగా ఛాతీ నొప్పి , లేదా గుండెల్లో బరువుగా అనిపిస్తే గుండె సంబంధిత సమస్యలకు కారణంగా అనుమానించి వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఛాతీలో అసౌకర్యంగా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా చాతిలో ఎడమవైపున అసౌకర్యం కలిగి ఉన్నట్లయితే కచ్చితంగా గుండె వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సాధారణమైన ఛాతీ నొప్పికి, గుండె నొప్పికి కొద్దిపాటి వ్యత్యాసం ఉంటుందని, దానిని గుర్తించాలంటున్నారు. గుండె నొప్పి అసౌకర్యాన్ని కలిగించటంతో పాటు ఎక్కువ సేపు గుండెపై భారంగా అనిపిస్తుందని, కొన్ని సందర్భాల్లో పిండుతున్నట్లుగా నొప్పి పుడుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఛాతి నొప్పిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు.

అకస్మాత్తుగా వాంతులు అవుతున్నాయా?
గుండె జబ్బులకు మరొక లక్షణం వాంతులు. కొన్నిసార్లు ఛాతీ నొప్పి తర్వాత వాంతులు మొదలవుతాయి. ఈ వాంతులు గుండె జబ్బులను సూచించే ప్రమాదకరమైన లక్షణమని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదని, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఒక్కసారిగా చాతీనోప్పి వచ్చి వాంతులు అయితే నిర్లక్ష్యం చెయ్యకుండా ఆస్పత్రికి వెళ్లాలని అంటున్నారు.

విపరీతమైన కడుపునొప్పి
గుండె జబ్బులకు మరొక ముఖ్యమైన లక్షణం విపరీతమైన కడుపు నొప్పి. సహజంగా మనకు కడుపునొప్పి అనేక కారణాల వల్ల కలిగినప్పటికీ, దీనిని గుండెజబ్బుల హెచ్చరికగా కూడా పరిగణించాలని, వైద్యులను సంప్రదించి కడుపు నొప్పికి గల కారణాలను తెలుసుకొని, తదనుగుణంగా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కడుపు నొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది గుండెను ప్రమాదంలో పడేయవచ్చని చెబుతున్నారు. ఇక భుజాల నొప్పి, ఎడమ చెయ్యి లాగటం, మెడ నొప్పి, వెన్ను నొప్పి కూడా గుండె జబ్బుల సంకేతాలని అంటున్నారు.

దవడల నొప్పి .. నిర్లక్ష్యం చెయ్యకండి
గుండెజబ్బులకు మరొక లక్షణం తరచుగా దవడలు నొప్పి కలిగి ఉండటం. విపరీతమైన దవడలు నొప్పి పెడుతున్నా నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. దవడలు ఎక్కువగా నొప్పి పెడుతుంటే అది గుండె జబ్బులకు సంబంధించిన లక్షణం కావచ్చని చెబుతున్నారు. దీనికి వెంటనే పరీక్షలు చేయించుకోవటం అవసరమని, లేకుంటే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? అయితే అలెర్ట్
అంతేకాదు అకస్మాత్తుగా విపరీతంగా చెమటలు పట్టడాన్ని కూడా గుండె జబ్బుల లక్షణంగా చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా వేసవికాలంలో మనం ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు చెమటలు పట్టడానికి, ఏసీ గదిలో కూర్చున్నా .. ఎలాంటి పని లేకున్నా చెమటలు పట్టడానికి తేడా ఉంటుందని, ఏ పనీ చేయకుండా విపరీతమైన చెమట పడుతుంటే అది గుండె జబ్బుల లక్షణంగా భావించాలని వైద్యులు చెబుతున్నారు. ఇక అలాంటి వారు నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రిలో చూపించుకోవాలి అని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications