కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం అస్సలు మర్చిపోవద్దు; ఎందుకంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం!!

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. శరీరంలో అన్నిటి కంటే కళ్ళు అత్యంత ముఖ్యమైనవి. అటువంటి కళ్ళ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కాలంలో కళ్ళ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే కళ్ళు మసకబారడం, కనిపించకపోవడం వంటి సమస్యలతో అనేకమంది కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే కళ్ల విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలని, కళ్ల సంరక్షణ కోసం మంచి పౌష్టికాహారం తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

 పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో కళ్ల ఆరోగ్యం మెరుగు

పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో కళ్ల ఆరోగ్యం మెరుగు

కళ్ళు ఆరోగ్యంగా ఉండటం కోసం ఎటువంటి ఆహారాలు తినడం మంచిది అన్నది చూస్తే, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు తినడం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. పచ్చి కూరగాయలలో కరెటోనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కళ్ళ కు మేలు చేస్తాయని చెబుతున్నారు. ఆకుపచ్చని కూరలు, కూరగాయలతో కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.

కళ్ళ ఆరోగ్యం కోసం చేపలను ఆహారంలో భాగం చేసుకోండి

కళ్ళ ఆరోగ్యం కోసం చేపలను ఆహారంలో భాగం చేసుకోండి

ఇక అంతే కాదు కళ్ల ఆరోగ్యం కోసం తినవలసిన ఆహార పదార్థాలలో చేపలు ముఖ్యమైనవిగా చెబుతున్నారు. చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయని, వీటిని తినడం వల్ల కళ్లు పొడిబారే సమస్యలనుండి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి కళ్ల ఆరోగ్యం కోసం చేపలు తినడం ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

కళ్ళ ఆరోగ్యం కోసం క్యారెట్ తిన్నా, క్యారెట్ జ్యూస్ తాగినా మేలు

కళ్ళ ఆరోగ్యం కోసం క్యారెట్ తిన్నా, క్యారెట్ జ్యూస్ తాగినా మేలు

కళ్ల ఆరోగ్యం కోసం క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కంటి చూపును పెంచటంలో క్యారెట్ ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ, బీటా-కెరోటిన్ కళ్లకు ఎంతో ముఖ్యమైనదని చెబుతున్నారు. క్యారెట్ ను సలాడ్ రూపంలో కానీ, జ్యూస్ రూపంలో కానీ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. దీనివల్ల కంటిచూపు పెరుగుతుందని అంటున్నారు.

కంటి ఆరోగ్యం కోసం బాదంపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది

కంటి ఆరోగ్యం కోసం బాదంపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది

ఇక కళ్ల ఆరోగ్యం కోసం బాదంపప్పు ఎంతగానో పనిచేస్తుందని సూచిస్తున్నారు. బాదం పప్పు లో ఉండే విటమిన్ ఏ ఆరోగ్యకరమైన కణజాలాన్ని దెబ్బతీసే అణువుల నుంచి మనను రక్షిస్తుందని సూచిస్తున్నారు. బాదం పప్పు తినడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు నానబెట్టిన బాదం పప్పులు తినడం మేలు చేస్తుందని చెబుతున్నారు.

కళ్ళ ఆరోగ్యం కోసం ఈ పండ్లు తింటే మేలు

కళ్ళ ఆరోగ్యం కోసం ఈ పండ్లు తింటే మేలు

కళ్ళ ఆరోగ్యం కోసం బొప్పాయి, ఆరెంజ్ ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. నల్ల ద్రాక్ష, ఎర్ర ద్రాక్ష ,దానిమ్మ కూడా కళ్ళ ఆరోగ్యాన్ని గణనీయంగా పెంచుతాయని చెబుతున్నారు. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది కళ్లకు మేలు చేస్తుందని, ఆరంజ్ తినడం వల్ల రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరెంజ్ లోని పోషకాలు కళ్లకు సంబంధించిన అనేక వ్యాధులను దూరం చేస్తాయని చెబుతున్నారు.

కంటి ఆరోగ్యానికి బొప్పాయి చేసే మేలు అంతా ఇంతా కాదు
ఇక బొప్పాయిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అని, అనేక వ్యాధుల నుంచి కళ్లను రక్షిస్తాయి అని చెబుతున్నారు. ఏది ఏమైనా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రధానంగా పౌష్టికాహారం పై దృష్టి సారించాలని, పైన పేర్కొన్న ఆహారాన్ని తీసుకున్నట్లయితే మన కళ్ళను మనం కాపాడుకోవచ్చని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+