వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: వెల్లుల్లి ఆరోగ్య ప్రదాయిని.. ఎన్ని అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందో తెలుసా?

|
Google Oneindia TeluguNews

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామాన్ని చేయడమే కాకుండా, ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు మన ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే అనేక పదార్థాలు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి అనే విషయాన్ని గుర్తించాలి. ఇక ఆ కోవకే చెందింది వెల్లుల్లి. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇక ఈ క్రమంలో ఆరోగ్య ప్రదాయిని అయిన వెల్లుల్లితో ఎన్ని రకాల అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు అనేది ఇక్కడ తెలుసుకుందాం.

అనేక అనారోగ్య సమస్యలకు వెల్లుల్లితో చెక్

అనేక అనారోగ్య సమస్యలకు వెల్లుల్లితో చెక్

వెల్లుల్లిలో విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ సి తో పాటుగా మాంగనీస్, క్యాల్షియం, కాపర్, సెలీనియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అంతేకాదు వెల్లుల్లిలో అలిసిన్ అనే ఓ ప్రత్యేక ఔషధ మూలకం ఉంది. ఈ మూలకం యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి మనకు ఎంతగానో మేలు చేకూరుస్తుంది. నిజ జీవితంలో మనం ఎదుర్కొనే అనేక అనారోగ్య సమస్యలకు వెల్లుల్లి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది.

 ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కలిగే ప్రయోజనాలివే

ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కలిగే ప్రయోజనాలివే

ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ రేటు మెరుగుపడుతుందని గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు. ఇక ప్రతిరోజూ ఉదయం వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటే ఇది రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుందని, చర్మ వ్యాధులు రాకుండా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

శరీరాన్ని డీ టాక్సిపై చేస్తుంది వెల్లుల్లి

శరీరాన్ని డీ టాక్సిపై చేస్తుంది వెల్లుల్లి

వెల్లుల్లిని ప్రతి నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లి శరీరం డీటాక్సిఫై అవుతుందని చెబుతున్నారు. ఫలితంగా అనేక వ్యాధులతో పోరాడే శక్తిని పొందుతారని సూచిస్తున్నారు. వెల్లుల్లి క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. ఇక అంతే కాదు నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని దంచి అందులో రసాన్ని తీసి తేనెలో కలుపుకొని తాగితే దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.

 చర్మ సమస్యలకు, కొలెస్ట్రాల్ సమస్యలకు వెల్లుల్లితో పరిష్కారం

చర్మ సమస్యలకు, కొలెస్ట్రాల్ సమస్యలకు వెల్లుల్లితో పరిష్కారం

ఇక చర్మంపై అలర్జీలు, గజ్జి, తామర వంటి వ్యాధులు ఉన్నవారికి కూడా క్రమం తప్పకుండా వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారికి వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని ప్రతిరోజూ రెండు సార్లు తీసుకుంటే మధుమేహం సమస్యలకు చెక్ పెట్టొచ్చని, ఇక ఈ మిశ్రమం పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది అని చెబుతున్నారు .

డయాబెటిస్, బీపీలను కంట్రోల్ లో ఉంచుతుంది వెల్లుల్లి

డయాబెటిస్, బీపీలను కంట్రోల్ లో ఉంచుతుంది వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీ కొలస్ట్రాల్ లక్షణాలు ఉంటాయని, అందుకే ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగిస్తారు అని అంటున్నారు. ప్రతిరోజు ఉదయం వెల్లుల్లిని తీసుకునేవారిలో డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది అని చెబుతున్నారు. వెల్లుల్లిలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ గుణాల వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని చెబుతున్నారు. ఇక బీపీ సమస్యతో బాధపడేవారికి కూడా వెల్లుల్లి బీపీ నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Garlic is very useful in maintaining our health. It is said that garlic reduces digestive problems, skin problems, cholesterol problems, diabetes and BP control, garlic has many health benefits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X