health tips: భోజనం చేసిన తర్వాత ఈ 4పనులు చేస్తున్నారా? ప్రమాదంలో మీ ఆరోగ్యం!!
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి అన్నం తిన్న తర్వాత చాలామంది చెయ్యకూడని అనేక పనులు తెలిసీ తెలియక చేస్తూ ఉంటారు. అయితే భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తే తీవ్ర అనారోగ్యం బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకునే విషయంలో నియమాలను పాటించడంతో పాటు, భోజనం చేసిన తర్వాత చేయకూడని కొన్ని పనులను సూచిస్తున్నారు.

భోజన నియమాలు పాటించని వారు వ్యాధిగ్రస్తులు అవుతారు
చాలామంది భోజనం విషయంలో నియమాలను పాటించరు. అలా భోజనం విషయంలో నియమాలను పాటించిన వారు వ్యాధిగ్రస్తులు అవుతారు. భోజనం చేసే విషయంలో మితాహారం తీసుకోవాలని, ఒక క్రమబద్దమైన సమయాన్ని పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేస్తున్న భోజనం రుచికరంగా ఉంటే అతిగా తినడం, లేదంటే సరిగ్గా తినకపోవడం వంటి రెండు ప్రమాదకరమైనవే అని చెబుతున్నారు. భోజనం ఎప్పుడు మితంగా చేయాలని, మన కడుపు కొంత ఖాళీ ఉండేలా తినాలని సూచిస్తున్నారు.

తిన్న తర్వాత వ్యాయామం చేస్తున్నారా ? డేంజర్
భోజనం చేసిన తర్వాత చేయకూడని కొన్ని పనులను కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తిన్న తర్వాత వ్యాయామం చేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. చాలామంది తిన్న తర్వాత అది తొందరగా అడగాలని వ్యాయామం చేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరమని భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేయడం వల్ల, అనేక సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత శారీరక వ్యాయామం కావాలంటే సాధారణ నడక సరిపోతుందని, అంతకుమించి మరే ఇతర వ్యాయామాలు చేయకూడదని సలహా ఇస్తున్నారు.

తిన్న వెంటనే నిద్ర పోతున్నారా? ఊబకాయం పక్కా!!
ఇక భోజనం చేసిన తర్వాత కొంతమంది వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. అది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. తిన్న వెంటనే నిద్ర పోవడం వల్ల బరువు విపరీతంగా పెరుగుతారని, ఊబకాయులు గా మారతారని చెబుతున్నారు. భోజనానికి నిద్రకు మధ్య లో మూడు గంటల వ్యవధి ఉండాలని, తిన్న వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి నష్టం చేస్తుందని చెబుతున్నారు.

భోజనం చేసి ఈత కొడుతున్నారా? కడుపులో తిమ్మిర్లు
ఇక భోజనం చేసిన తర్వాత వెంటనే చేయకూడని మరొక పని ఈత కొట్టడం. ఎవరూ పొరపాటున కూడా తిన్న తర్వాత ఈత కొట్టడానికి వెళ్ళకూడదని వైద్యులు చెబుతున్నారు. తిన్న తర్వాత ఈత కొడితే కడుపులో తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు. కనుక పొరపాటున కూడా తిన్న తర్వాత ఎవరు ఈత కొట్టడానికి ప్రయత్నించవద్దని వైద్యులు చెబుతున్నారు.

భోజనం చేసి స్నానం చేస్తున్నారా? జీర్ణ సమస్యలు
ఇక భోజనం చేసిన తర్వాత చేయకూడని మరొక పని స్నానం చేయటం. కొంతమంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తుంటారు. అలా చెడు ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే అది శరీర ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచుతుందని, దాని వలన జీర్ణక్రియ సమస్యలు వంటివి ఉత్పన్నమవుతాయని చెబుతున్నారు. కాబట్టి భోజనానికి ముందే స్నానం చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఒకవేళ భోజనం చేసిన తర్వాత స్నానం చేయాలంటే కనీసం గంట వ్యవధిని అయినా ఇవ్వాలని సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు అనారోగ్యాల బారిన నుండి కాపాడుకున్న వారమవుతాము అని వైద్యులు చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications