వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: రోజూ ఒక యాపిల్ తినండి.. ఎన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చో చూడండి!!

|
Google Oneindia TeluguNews

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన వ్యాయామం, సరైన నిద్రతో పాటు, సరైన ఆహారం తీసుకోవడం కూడా ఎంతో అవసరం. ఇక అటువంటి ఆహారంలో పండ్ల పాత్ర చాలా ముఖ్యమైనది. పండ్లు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించటంలో కీలకంగా పనిచేస్తాయి. అటువంటి పండ్లలో యాపిల్ అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రతి రోజూ ఒక ఆపిల్ పండు తింటే అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చునని, ఆరోగ్యంగా జీవించవచ్చు అని చాలా మంది వైద్యులు చెబుతున్నారు.

యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ .. అనేక అనారోగ్యాలకు చెక్

యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ .. అనేక అనారోగ్యాలకు చెక్

ఇక యాపిల్ ను రోజు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాపిల్ తినడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. యాపిల్లో శరీరానికి కావలసిన గొప్ప సహజమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే కచ్చితంగా నిత్యం యాపిల్ తినాలని చాలా మంది చెబుతుంటారు. ఊబకాయం, తలనొప్పి, క్షయ, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి అనేక సమస్యలకు యాపిల్ తినడం వల్ల పరిష్కారం దొరుకుతుంది.

శరీర బరువును, చెడు కొలెస్ట్రాల్ తగ్గించటంలో యాపిల్ చాలా ఉపయుక్తం

శరీర బరువును, చెడు కొలెస్ట్రాల్ తగ్గించటంలో యాపిల్ చాలా ఉపయుక్తం


యాపిల్ మన కంటి చూపును మెరుగు పరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర బరువును తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో యాపిల్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నిత్యం యాపిల్ తినడం వల్ల చాలా రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుంది. పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాలు పెరగకుండా యాపిల్ నిరోధిస్తుంది. యాపిల్ గుండె ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది.

మన శరీరాన్ని యవ్వనంగా ఉంచటంలో యాపిల్ కీలకం

మన శరీరాన్ని యవ్వనంగా ఉంచటంలో యాపిల్ కీలకం


నిత్యం యాపిల్ తినడం వల్ల మన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచటంలో ఆపిల్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇక కాలేయంలోని వ్యర్థాలను తొలగించడంలో యాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. యాపిల్ తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అల్జీమర్స్ వంటి మతిమరుపు రోగ నివారణకు యాపిల్ బాగా పనిచేస్తుంది. పెప్టిన్ దండిగా ఉండే యాపిల్ పండ్లను తినడం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా కూడా గణనీయంగా పెరుగుతుంది . యాపిల్ లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల అది రక్తహీనత నుండి మనల్ని కాపాడుతుంది. యాపిల్ లో సోడియం తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తపోటును పెరగకుండా చూస్తుంది.

నిత్యం యాపిల్ తినే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువ

నిత్యం యాపిల్ తినే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువ

ఇక యాపిల్ తినని మహిళలతో పోలిస్తే ప్రతి రోజూ ఒక ఆపిల్ తిన్న మహిళలలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 28 శాతం తక్కువగా ఉంటుందని ఇటీవల పలు అధ్యయనాలు కూడా తేల్చాయి. కాబట్టి డయాబెటిస్ బారిన పడకుండా కాపాడటంలో యాపిల్ కీలకంగా పని చేస్తుంది. యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగానూ కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగానూ పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఉండే ఆపిల్ ను రోజూ ఒకటి తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతారు. మరి అటువంటి ఆపిల్ పండ్లను రోజు ఒకటి మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదే కదా!!

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: అద్భుతమైన వంటింటి మెడిసిన్.. పసుపుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!!health tips: అద్భుతమైన వంటింటి మెడిసిన్.. పసుపుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!!

English summary
Eating an apple every day can prevent many health problems. Eating apple daily is good for the heart. Many cancers can be prevented. Eyesight improves. Useful for weight loss and lowering bad cholesterol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X