వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Health tips: సంక్రాంతి పిండివంటలు అతిగా లాగిస్తున్నారా? అయితే ముందీ విషయం తెలుసుకోండి!!

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ పిండి వంటలు నోరూరిస్తున్నాయి. సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నిత్యం డైటింగ్ చేసే వారు కూడా పండుగ పర్వదినాలలో నోటి కంట్రోల్ మర్చిపోతారు. ఇక రోజువారీ ఆహారపు అలవాట్లలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. వ్యాయామం మరచిపోతారు. ఈ రెండు రోజులే కదా అంటూ అన్ని నియమాలకు గుడ్ బై చెప్పి ఫోకస్ అంతా తిండిపైనే పెడతారు. రుచికరమైన ఆహార పదార్థాలను, పిండివంటలను ఎడాపెడా లాగించేస్తుంటారు.

అతిగా పిండి వంటలు తింటే అనారోగ్య సమస్యలు

అతిగా పిండి వంటలు తింటే అనారోగ్య సమస్యలు

అయితే పండుగ సమయంలో చేసిన పిండి వంటలతో జాగ్రత్తగా ఉండాలని, పిండివంటలను మితంగా తినాలని సూచిస్తున్నారు వైద్యులు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా తింటే రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పండుగల సమయాల్లో నోరూరించే రుచికరమైన పిండివంటల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. పండుగల సమయంలో చేసే పిండివంటల్లో అన్ని ఆరోగ్యకరమైనవి కావు.

తినకూదని, తినాల్సిన పిండి వంటలు ఇవే

తినకూదని, తినాల్సిన పిండి వంటలు ఇవే


కొన్ని పిండి వంటలు మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంతో పాటు, మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. మినప సున్నుండలు, రాగి లడ్లు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఇలాంటి వాటిని తినడం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ చక్కెరతో చేసిన స్వీట్లు, బియ్యం పిండితో చేసిన రకరకాల పిండి వంటలు మన శరీరంలో క్యాలరీలు అధికంగా చేరడానికి కారణం అవుతాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

పిండివంటలను తినే విషయంలో పాటించాల్సిన పద్దతులివే

పిండివంటలను తినే విషయంలో పాటించాల్సిన పద్దతులివే

పిండి వంటలు తినే విషయంలో కొన్ని పద్ధతులను పాటించాలి. బాగా రుచిగా ఉన్నాయని ప్లేట్లకు ప్లేట్లు లాగించేయకూడదు. పిండి వంటలను వేటిని తిన్నా మితంగా తినాలి. ఏదో కొద్దిగా టేస్ట్ చూసే నిమిత్తం తినాలి తప్ప అదేపనిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎవరైనా ఆఫర్ చేస్తే సున్నితంగా తిరస్కరించాలి, లేదా తమకు పెట్టిన వాటిని అందరితో పంచుకోవాలి. కానీ పెట్టారని మొహమాటానికి తింటే ముఖ్యంగా అజీర్ణం సమస్య తిన్నవారిని వేధిస్తుంది. పిండి వంటలు ఎక్కువగా తింటే విపరీతమైన బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ఏది తిన్నా సెలెక్టివ్ గా, మితంగా తినాలి

ఏది తిన్నా సెలెక్టివ్ గా, మితంగా తినాలి

కాబట్టి పండుగ సమయాల్లో పిండివంటల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది .అంతే కాదు పండుగల సమయాలలో కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా గడుపుతూ శారీరక వ్యాయమంపై కూడా పెద్దగా దృష్టి సారించము. ఈ నేపథ్యంలో తినే ఆహారం పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా కాకుండా మొహమాటానికి ఎవరు ఏది పెడితే అది తింటే ఫలితంగా బరువు పెరిగి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక పండుగ సమయాలలో ఏది తిన్నా చాలా సెలెక్టివ్ గా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: మీరు నీళ్ళు తక్కువ తాగుతున్నారని చెప్పే సంకేతాలివే.. ఒకసారి చెక్ చేసుకోండి!!health tips: మీరు నీళ్ళు తక్కువ తాగుతున్నారని చెప్పే సంకేతాలివే.. ఒకసారి చెక్ చేసుకోండి!!

English summary
Sankranti special traditional foods are tempting and people out of control of food. The doctors say to learn to eat moderately and selectively. Otherwise, it is said that many health problems will come along with weight gain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X