వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: విపరీతమైన కీళ్ళనొప్పులా? కారణాలివే.. నిర్లక్ష్యం చేస్తే నరకమే!!

|
Google Oneindia TeluguNews

కీళ్ల నొప్పులు... చూసే వారికి పెద్ద సమస్యలా కనిపించకపోయినప్పటికీ అనుభవించే వారికి మాత్రం అది నిత్య నరకం గా అనిపిస్తుంది. విపరీతమైన నొప్పులతో, ఏ పనీ సరిగ్గా చెయ్యలేని పరిస్థితికి కారణం అవుతుంది. ఇక దీని ప్రభావం మానసికంగా కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆర్థరైటిస్ ను ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేరకు కీళ్లనొప్పుల ప్రభావం నుండి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెపుతున్నారు.

health tips: విపరీతమైన నరాల నొప్పులా? కారణాలివే.. ఉపశమనానికి ఇంటి చిట్కాలివే!!health tips: విపరీతమైన నరాల నొప్పులా? కారణాలివే.. ఉపశమనానికి ఇంటి చిట్కాలివే!!

 చిన్న వయసులోనే వేధిస్తున్న కీళ్ళ నొప్పుల సమస్య

చిన్న వయసులోనే వేధిస్తున్న కీళ్ళ నొప్పుల సమస్య


మారుతున్న జీవనశైలి, గంటల కొద్దీ ఒకే చోట కూర్చోవడం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది లో చిన్న వయసులోనే కీళ్ళనొప్పుల సమస్య వేధిస్తుంది. నొప్పి పుడుతుందని పెయిన్ రిలీఫ్ బామ్ లు రాసి, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సరిపోతుందని చాలామంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు. అయితే ప్రారంభంలోనే ఈ సమస్యను గుర్తించి తగిన జాగ్రత్త తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య నుండి బయట పడవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

 కీళ్ళ నొప్పు2లు రావటానికి కారణాలివే

కీళ్ళ నొప్పు2లు రావటానికి కారణాలివే


కీళ్ల నొప్పుల సమస్యను ఆర్థరైటిస్ అంటారు. కీళ్లు అరిగిపోవడాన్ని ఆర్థరైటిస్ గా చెబుతారు. సహజంగా ఇది వయసుతో పాటు వచ్చే సమస్య అయినప్పటికీ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కదలకుండా ఒకేచోట కూర్చుని ఉన్న పరిస్థితులు యుక్తవయస్కుల్లోనూ కీళ్ల సమస్యకు ప్రధాన కారణం గా మారుతున్నాయి. ఏదైనా గాయం వల్ల లేదా శరీరంలో పోషకాహారలోపం వల్ల కూడా కీళ్ల నొప్పులు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు.

 ఆర్థరైటిస్ లో రెండు రకాలు.. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్

ఆర్థరైటిస్ లో రెండు రకాలు.. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్


ఇక ఆర్థరైటిస్ లో రెండు రకాలు ఉంటాయి అని అవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెబుతున్నారు. ఆస్టియో ఆర్థరైటిస్ లో కీళ్ళ కణజాలాలు గట్టిగా మారి ఎముకలను కప్పివుంచే కణజాలం చచ్చిపోవడం ప్రారంభిస్తుందని, ఫలితంగా కూర్చున్నప్పుడు లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు కీళ్లలో నొప్పి విపరీతంగా వస్తుందని చెబుతున్నారు.

 సైలెంట్ కిల్లర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్

సైలెంట్ కిల్లర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్


ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధి అని, ఇందులో శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కీళ్ళ పై దాడి చేస్తుందని, ఈ వ్యాధి ప్రారంభం కీళ్ళ రెండు ఎముకల కొనల నుంచి లేదా చివర్ల నుంచి ప్రారంభమవుతుందని చెబుతున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సైలెంట్ కిల్లర్ గా చెప్పబడే వ్యాధుల్లో ఒకటి. కుటుంబంలో ఒకరికి ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఇది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వంశపారంపర్యంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల విపరీతమైన నొప్పులు వాపులు వస్తాయి. ముఖ్యంగా కీళ్ల వాపులకు గురై నొప్పిగా అనిపిస్తాయి.

 కీళ్ళ నొప్పులను నిర్లక్ష్యం చేస్తే జీవితం దుర్భరంగా మారుతుంది

కీళ్ళ నొప్పులను నిర్లక్ష్యం చేస్తే జీవితం దుర్భరంగా మారుతుంది


శరీరంలో ఎక్కడ ఏ నొప్పి వచ్చినా ఓ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే.. లేదా నొప్పిని తగ్గించే బామ్ లతో నొప్పి రిలీఫ్ అవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఖచ్చితంగా వైద్యుని సూచన మేరకు పరీక్షలు చేయించుకుని ఆర్థరైటిస్ అని తేలితే తగిన చికిత్స తీసుకోవాలని, లేదంటే విపరీతమైన నొప్పులతో జీవితం దుర్భరంగా మారుతుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Due to changing lifestyle, sitting in one place for hours and eating habits, many people suffer from arthritis at an early age. It is said that if you do not take care in the beginning, you will have to face serious consequences later
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X