health tips: ఉదయాన్నే పరగడుపున నీళ్ళు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఓ లుక్కెయ్యండి!!

ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన విధానంలో చిన్న చిన్న చిట్కాలను పాటించాలి అని చాలామంది వైద్యులు, పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుత పరుగుల ప్రపంచంలో, శారీరక వ్యాయామం లేని జీవన విధానంతో అనేక రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఇక జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని సూచిస్తున్నారు.

 ఉదయాన్నే నీళ్ళు ఎందుకు తాగాలి?

ఉదయాన్నే నీళ్ళు ఎందుకు తాగాలి?

సృష్టిలోని అన్ని సంపదల కన్న ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద అని గుర్తించినవారు ఆరోగ్యం కోసం ఖచ్చితంగా చిన్న చిన్న చిట్కాలను తప్పకుండా పాటిస్తారు. అలా ఆరోగ్యం కోసం పాటించవలసిన చిట్కాలలో ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత నీళ్లు తాగడం ఒకటి. ఈరోజు మనం ఉదయాన్నే లేచిన తర్వాత నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను, అసలు నీటిని ఎందుకు తాగాలి అనే కారణాలను తెలుసుకుందాం.

ఉదయాన్నే నీళ్ళు త్రాగటం వల్ల ప్రయోజనాలు ఇవే

ఉదయాన్నే నీళ్ళు త్రాగటం వల్ల ప్రయోజనాలు ఇవే

ఉదయం నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. కాబట్టి చాలామంది ఉదయం లేచిన వెంటనే ఖాళీకడుపుతో నీళ్లను తాగుతున్నారు. అయితే నీటిని తాగే క్రమంలో బ్రష్ చేసుకున్న తర్వాత నీళ్లను తాగాలా? లేక బ్రష్ చేసుకోక ముందే నీళ్లను తాగాలా అన్న సందేహం అనేక మందికి కలుగుతూ ఉంటుంది. బ్రష్ చేయక ముందే నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామంది విశ్వసిస్తారు. ఖాళీ కడుపుతో బ్రష్ చేయకుండా నీటిని తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని, చర్మ సౌందర్యం మెరుగు పడుతుందని చెబుతున్నారు.

ఉదయాన్నే నీళ్ళు తాగటంతో అందంతో పాటు ఆరోగ్యం

ఉదయాన్నే నీళ్ళు తాగటంతో అందంతో పాటు ఆరోగ్యం

ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల ఇది మన శరీరంలోని మెటబాలిజంను 24 శాతం పెంచుతుందని, పెద్ద ప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాలు గ్రహిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకాన్ని కూడా ఇది నివారిస్తుందని చెబుతున్నారు. ఉదయాన్నే నీళ్లు తాగడం ఒత్తిడి పైన పోరాటం చేస్తుందని, ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది అని చెబుతున్నారు. ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల చర్మంపై ఉన్న స్వేద రంధ్రాలు శుభ్రపడి చర్మం అందంగా మెరిసి పోతుందని చెబుతున్నారు. ఉదయాన్నే నీళ్ళు తాగటం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందని చెప్తున్నారు.

బీపీ, డయాబెటిస్ ఉన్నవారికి ఎన్నో ప్రయోజనాలు

బీపీ, డయాబెటిస్ ఉన్నవారికి ఎన్నో ప్రయోజనాలు

ఇక ఇదే సమయంలో ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుందని, నోటి పూత, ఆహారం జీర్ణం కాక వచ్చే త్రేనుపు వంటి సమస్యలు తగ్గుతాయి అని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి బలపడుతుందని, రోజుకు 10 నుండి 12 గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఇక అధిక రక్తపోటు ఉన్న వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఉదయాన్నే నీటిని తాగడం ఎంతో మేలు చేకూరుతుందని చెబుతున్నారు. ఊబకాయం వంటి సమస్యల నుంచి ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+