వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: ఈ మూడింటినీ రోజూ ఆహారంలో భాగం చేసుకోండి.. అనారోగ్యాలకు చెక్ పెట్టండి!!

|
Google Oneindia TeluguNews

మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఇక వీటిని ఆహారంలో వస్తే తీసి పక్కన పెట్టే వారు చాలామంది ఉంటారు. కానీ మన నిజ జీవితంలో మనం ఇంట్లో నిత్యం ఉపయోగించే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు లలో మన ఆరోగ్యానికి కావల్సిన గొప్ప ఔషధ గుణాలు దాగి ఉన్నాయని, అవి మన అనారోగ్య సమస్యలను ఇట్టే దూరం చేస్తాయన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.

పుదీనాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

పుదీనాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

నిత్యం వంటలో మనం వాడుకునే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏ అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతాయో, వాటిల్లో ఉన్న ఔషధ గుణాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో కొన్నింటిని ఈరోజు ఇక్కడ తెలుసుకుందాం. నిత్యం మనం వంటల్లో ఉపయోగించే పుదీనా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. పుదీనాను మన ఆహారంలో చేర్చుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు పుదీనా లో ఉండే ఔషధ గుణాల వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అనేక అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పుదీనా

అనేక అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పుదీనా


కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు నీళ్లలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే జ్వరంతో పాటు, కామెర్లు, చాతీ మంట, కడుపులో మంట, మూత్ర సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయని చెబుతున్నారు. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం కూడా పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక పుదీనా పచ్చడి పిల్లల్లో ఆకలిని పెంచుతుంది. అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. పుదీనా ఆహారంలో తీసుకోవటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, పుదీనా చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు.

కరివేపాకే కదా అని పక్కన పెడితే మీకే నష్టం.. ఎలా అంటే

కరివేపాకే కదా అని పక్కన పెడితే మీకే నష్టం.. ఎలా అంటే


మనం వంటల్లో ఉపయోగించే కరివేపాకును అందరూ తీసి పక్కన పెడుతూ ఉంటారు. కానీ కరివేపాకు తినాలని చెప్తున్నారు. కరివేపాకుతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. కరివేపాకు ఆకులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. కరివేపాకు మన వంటల్లో రుచిని పెంపొందించడమే కాకుండా మనకు అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని, నిత్యం కరివేపాకు తీసుకునేవారిలో కాలేయం సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. కరివేపాకుతో రక్త హీనత తగ్గ్గుతుందని చెప్తున్నారు.

బరువు తగ్గటంలోనూ కరివేపాకుది కీలక పాత్ర

బరువు తగ్గటంలోనూ కరివేపాకుది కీలక పాత్ర

కరివేపాకు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది అని, జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్నారు. కరివేపాకు నిత్యం తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుందని, అంతేకాకుండా వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయని చెబుతున్నారు. కరివేపాకు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది అని, కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది అని చెబుతున్నారు.

కొత్తిమీర తింటే బెనిఫిట్స్ ఎన్నో ..

కొత్తిమీర తింటే బెనిఫిట్స్ ఎన్నో ..


ఇక కొత్తిమీర కూడా ఎన్నో ఔషధ ప్రయోజనాలతో మన ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని చెబుతున్నారు. నిత్యం కొత్తిమీర తినడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుందని, శరీరంలో వేడిని తగ్గిస్తుంది అని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందని, ఫలితంగా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందని చెబుతున్నారు . అంతేకాదు ఇక శ్వాసనాళాలలో ఉన్న కఫాన్ని బయటకు తీసుకు రావడానికి కూడా కొత్తిమీర బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. కొత్తిమీర కడుపునొప్పి వంటి సమస్యలను తగ్గ్గిస్తుందని చెప్తున్నారు.

కొత్తిమీరతో ఈ అనారోగ్య సమస్యలకు చెక్

కొత్తిమీరతో ఈ అనారోగ్య సమస్యలకు చెక్


కొత్తిమీర రక్తహీనతను తగ్గిస్తుంది అని, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని, రక్తనాళాల్లోని ఆటంకాలను తొలగిస్తుంది అని చెబుతున్నారు. ఇక ఫుడ్ పాయిజన్ జరిగిన సమయంలో కొత్తిమీర తో చేసిన ఆహారాన్ని తీసుకుంటే ఫుడ్ పాయిజన్ వల్ల కడుపులో తయారైన చెడు బ్యాక్టీరియాను అది నిర్వీర్యం చేస్తోందని చెబుతున్నారు. కొత్తిమీర బీపీని కంట్రోల్ చేస్తుందని, కళ్ళకు మంచిదని చెప్తున్నారు. మహిళలలో బహిస్టు తాలూకు నొప్పులను కూడా కొత్తిమీర తగ్గిస్తుందని చెప్తున్నారు. నోటి దుర్వాసన తగ్గించటంలో, ఎముకలు ధృడం గా ఉంచటంలో సహాయపడుతుందని చెప్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: చిన్న వయసులోనే ముఖంపై ముడతలు.. కారణాలివే; ముడతలు తగ్గాలంటే చెయ్యాల్సింది ఇదే!!health tips: చిన్న వయసులోనే ముఖంపై ముడతలు.. కారణాలివే; ముడతలు తగ్గాలంటే చెయ్యాల్సింది ఇదే!!

English summary
It is said that mint, curry leaves and coriander are very useful in protecting our health, and if these three are part of our daily diet, we can check to so many health problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X