health tips: డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!!
చాలామంది డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొద్ది రోజులు మందులు వాడటం, కొద్ది రోజులు మందులు వాడకుండా ఉండడం వంటి చర్యలకు పాల్పడుతుంటారు. ఇక డయాబెటిస్ స్థాయి ఎలా ఉంటుంది? రక్తంలో చక్కెర లెవెల్స్ కంట్రోల్ లో ఉన్నాయా లేదా అన్నది కూడా పరిశీలించుకోరు. ఇక ఏది పడితే అది తింటూ ఆహార నియమాలను కూడా పాటించరు. డయాబెటిస్ ఉన్నవారిలో సరిగ్గా మందులు వాడకుండా, సరైన ఆహారపు అలవాట్లను పాటించకుండా ఉంటే అది రకరకాల సమస్యలకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

డయాబెటిస్ .. నిర్లక్ష్యం చేస్తే కలిగే అనర్దాలెన్నో
ముఖ్యంగా డయాబెటిస్ కంట్రోల్ లేనివారికి అది రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. శరీరంలో అన్ని భాగాల పైన కంట్రోల్ లేని డయాబెటిస్ తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. శరీరంలో రక్తం సక్రమంగా ప్రవహించకపోతే అది అన్ని శరీర భాగాలకు చేరదని, ఫలితంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వార్నింగ్ ఇస్తున్నారు. డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారిలో కాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని, స్కిన్ ఎలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. చాలా సందర్భాల్లో డయాబెటిస్ బాధితులు చూపుని కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చే ఛాన్స్
డయాబెటిస్ బాధితులు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే మూత్రపిండాలు దెబ్బతింటాయి, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని, కాళ్లకి ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్లు తొలగించే ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక తీవ్రమైన డయాబెటిస్ బాధితులు గుండెపోటును కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. డయాబెటిస్ బాధితులకు పళ్ళ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతికి అవకాశం
అందుకే డయాబెటిస్ బాధితులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, నిత్యం మందులను వాడుతూ తరచూ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే శరీరంపై ఎక్కడైనా గాయాలైతే మానవు. విపరీతంగా బరువు తగ్గిపోతారు. అధిక మూత్ర విసర్జన ఇబ్బందిగా మారుతుంది. డయాబెటిక్ న్యూరోపతి వచ్చే ప్రమాదం ఉంటుంది. నరాల సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక కంటి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉంటుంది.

డయాబెటిస్ కంట్రోల్ లో లేకుంటే ప్రాణాలకే ప్రమాదం
డయాబెటిస్ కంట్రోల్ లేకపోతే ఇంటర్ లింక్ గా బీపీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రయత్నం లేకుండా బరువు తగ్గిపోతారు. డయాబెటిస్ శరీరంలోని అనేక అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే డయాబెటిస్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. బాగా సమస్య తీవ్రంగా లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ఒక్కోసారి ప్రాణాల మీదకే తెస్తుందని అంటున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications