వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: డయాబెటిస్ అధికంగా ఉన్నవారు ఆ పండ్లు తింటున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే!!

|
Google Oneindia TeluguNews

మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారంలో భాగంగా పండ్లను చేర్చాలని చాలా మంది వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అయితే డయాబెటిస్ బారిన పడినవారు ఎటువంటి పండ్లను తినొచ్చు. ఏ పండ్లు తింటే వారికి మంచిది. ఎటువంటి పండ్లను డయాబెటిస్ బాధితులు తినకుండా ఉండాలి అనే అంశాలు కూడా వారు తెలియజేస్తున్నారు.

health tips: మెడిసిన్స్ వేసుకుంటున్నారా? అయితే ఈ పదార్ధాలు అసలు తీసుకోవద్దు..వెరీ డేంజర్!!health tips: మెడిసిన్స్ వేసుకుంటున్నారా? అయితే ఈ పదార్ధాలు అసలు తీసుకోవద్దు..వెరీ డేంజర్!!

చక్కెర ఎక్కువగా ఉన్న పండ్లు తినకుంటేనే మంచిది

చక్కెర ఎక్కువగా ఉన్న పండ్లు తినకుంటేనే మంచిది


పండ్లు మరియు కూరగాయలు తినడం వల్ల గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ పుష్కలంగా పండ్లలో ఉంటాయి. అయితే, పండులో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ పెరుగుదలను నివారించడానికి చక్కెర పదార్థాలు, మరియు చక్కెర ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోకుండా ఉంటేనే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అత్యధిక చక్కర స్థాయిలు ఉన్నవారు పండ్ల విషయంలో జాగ్రత్త

అత్యధిక చక్కర స్థాయిలు ఉన్నవారు పండ్ల విషయంలో జాగ్రత్త


అయితే పండ్లలోని చక్కెర రకానికి మరియు చాక్లెట్ మరియు స్వీట్స్ వంటి ఇతర ఆహారాలలో చక్కెర రకానికి మధ్య వ్యత్యాసం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా, ఒక వ్యక్తి వారి ఆహారం నుండి పండ్లను మినహాయించకూడదు. 2017లో దీనిపై జరిగిన అధ్యయనం పండ్లను తినడం నిజానికి మధుమేహాన్ని నివారించడంలో సహాయపడుతుందని వెల్లడించింది. అయితే అది వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. అత్యధిక చక్కర స్థాయిలు ఉన్నవారు ఈ క్రింది పండ్లను తీసుకోవడం మంచిది కాదని సూచించబడింది.

 అరటిపండ్లు, పుచ్చకాయలకు దూరంగా ఉండటం మంచిది

అరటిపండ్లు, పుచ్చకాయలకు దూరంగా ఉండటం మంచిది


డయాబెటిస్ ఉన్న వారు చక్కెర అధికంగా ఉండే పండ్లను తీసుకోకూడదు. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఒక నిర్దిష్ట ఆహారం ఒక వ్యక్తి తిన్న తర్వాత రక్తంలో చక్కెరను ఎంత పెంచుతుందో చూపిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు బాగా ఎక్కువ మొత్తంలో పుచ్చకాయలు, అరటి పండ్లు తీసుకోకూడదు. ఒకవేళ వారు తీసుకున్నా చాలా మితంగా వాటిని తినాల్సి ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు అరటి పండు తినాలనుకుంటే అరటి పండు సగం ముఖం మాత్రమే తినాలని సూచిస్తున్నారు.

మామిడి పండ్లు ఎక్కువ తింటే డేంజర్

మామిడి పండ్లు ఎక్కువ తింటే డేంజర్


ఇక అంతే కాదు డయాబెటిక్ రోగులు మామిడి పండ్లను ఎక్కువ మొత్తంలో తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. మామిడి పండ్లను మధుమేహరోగులు తినొచ్చు కానీ ఎక్కువ తింటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. మామిడి కాయలు కేవలం మూడు ముక్కలు మాత్రమే డయాబెటిక్ రోగులు తినాలని, అంతకంటే ఎక్కువ తినటం ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఖర్బూజా, ద్రాక్షా, సీతాఫలాలు మంచిది కాదు

ఖర్బూజా, ద్రాక్షా, సీతాఫలాలు మంచిది కాదు


ఇక ఇదే సమయంలో ఖర్బూజా పండును కూడా తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. దీనిలో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుందని రెండు ముక్కలను మించి ఎక్కువ తినడం శరీరంలోని చక్కెర స్థాయిలను విపరీతంగా పెంచుతుందని చెబుతున్నారు. ఇక ద్రాక్ష పండ్లు తినడం మధుమేహ రోగులకు ఏమాత్రం మంచిది కాదని సూచించబడింది. ద్రాక్షా పండ్లలో కూడా చక్కెర స్థాయిలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి తినకుండా ఉంటేనే మంచిది. ఇక సీతాఫలాలు మధుమేహరోగులు తినకుండా ఉంటేనే మంచిదని సూచించబడింది. ఒకవేళ తినాలి అనుకుంటే మీడియం సైజు సీతాఫలాన్ని మాత్రమే తీసుకోవాలి.

ఏ పండ్లు తిన్నా మితంగా తినాలని వైద్యుల సూచన

ఏ పండ్లు తిన్నా మితంగా తినాలని వైద్యుల సూచన


అంతేకాదు పైనాపిల్ మధుమేహ రోగులకు మంచిదే అయినప్పటికీ పైనాపిల్ ను కూడా ఎక్కువగా తినడం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పైనాపిల్ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ 56 ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మధుమేహంతో పోరాడతాయి. అలాగని దీన్ని కూడా ఎక్కువగా తినకూడదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ తినాలనుకుంటే మూడు ముక్కల కంటే ఎక్కువ తినకూడదని సూచిస్తున్నారు. మధుమేహ రోగులు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినది షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవటం, ఏ పండ్లు తిన్నా మితంగా తినటం అని వైద్యులు సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Medical experts advise that people with diabetes are at risk if they consume a lot of bananas, watermelons, grapes, mangoes and custurd apples, and it is better to avoid them as much as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X