వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: ఆరోగ్యంగా ఉన్నామని చెప్పే ఆరు ప్రధాన లక్షణాలివే; మీకున్నాయా.. చెక్ చేసుకోండి!!

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత సంపాదించిన ఆరోగ్యం లేకపోతే సంపాదించిన దాన్ని అనుభవించటానికి కూడా ఉండదు. అందుకే ప్రస్తుతం ఎవరు ధనవంతులు అని ప్రశ్నిస్తే ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు అని ఠక్కున చెప్తారు. డబ్బులు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారు అనేకమంది సమాజంలో ఉన్నారు. సగటున 100 మందిలో 70 మంది రక రకాల అనారోగ్యాలతో బాధ పడుతున్నారు అంటే ఎంతగా రోగాలు పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇక దీర్ఘవ్యాధులు అయిన డయాబెటిస్, బిపి, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు మన సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. ప్రస్తుతం పెరిగిపోతున్న రోగాల దెబ్బకు ఆరోగ్యంపైన కూడా ప్రజల్లో శ్రద్ధ పెరుగుతుంది.

health tips: ఉదయం ఖాళీకడుపుతో ఈ పదార్ధాలు తింటున్నారా? అయితే అనారోగ్యం తెచ్చుకున్నట్టే!!health tips: ఉదయం ఖాళీకడుపుతో ఈ పదార్ధాలు తింటున్నారా? అయితే అనారోగ్యం తెచ్చుకున్నట్టే!!

మనం ఆరోగ్యవంతులం .. అవునా కాదా.. మనమే తెలుసుకోవచ్చు

మనం ఆరోగ్యవంతులం .. అవునా కాదా.. మనమే తెలుసుకోవచ్చు


ఇక మన ఆరోగ్యంగా ఉన్నామో లేదో అనేది మనమే నేరుగా తెలుసుకోవచ్చని ప్రకృతి వైద్యం చేసే నిపుణులు సూచిస్తున్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేదు. ప్రకృతి వైద్యం ప్రకారం ఆరోగ్యంగా ఉన్నవారిలో వారి ఆరోగ్యానికి సంబంధించి ఆరు ప్రధాన లక్షణాలు ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్టే అని చెబుతున్నారు. ఇక ఆరు లక్షణాలను గురించి తెలుసుకుందాం.

 ఆరోగ్యంగా ఉన్నవారిలో ఉండే ప్రధానమైన లక్షణం ఇదే

ఆరోగ్యంగా ఉన్నవారిలో ఉండే ప్రధానమైన లక్షణం ఇదే


ఆరోగ్యంగా ఉన్నవారు రాత్రిపూట ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నిద్ర పోతారు. ప్రతిరోజు రాత్రిపూట మంచం మీద పడుకో గానే హాయిగా నిద్ర పోయే వారికి మంచి ఆరోగ్య లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ 7 నుంచి 8 గంటల పాటు చక్కని నిద్ర పోగలిగినవారు ఆరోగ్యవంతులని సూచిస్తున్నారు. ఇక అందుకే ఎవరైనా ఆరోగ్యం గురించి చెక్ చేసుకోవాలంటే ముందు వారి నిద్ర ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిద్రపోతే వారు ఆరోగ్యవంతులు అనే చెప్పాలి. ఇది ఆరోగ్యవంతుల్లో ఉండే మొదటి లక్షణం అని చెబుతున్నారు.

ప్రతిరోజు సాఫీగా ఆ పని జరిగితే ఆరోగ్యంగా ఉన్నట్టే

ప్రతిరోజు సాఫీగా ఆ పని జరిగితే ఆరోగ్యంగా ఉన్నట్టే


ఇక ఆరోగ్యంగా ఉన్న వారికి ఉండవలసిన మరొక లక్షణం ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా మలవిసర్జన జరిగిపోవాలి. ఉదయం కాకున్నా రోజు మొత్తంలో ఒక్కసారైనా సాఫీగా మలవిసర్జన జరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్టేనని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండే వారిలో కాలకృత్యాల విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాఫీగా పని జరిగిపోతుంది. ఇది ఆరోగ్యంగా ఉండే వారిలో ఉండవలసిన రెండవ లక్షణమని చెబుతున్నారు.

 ఆకలి ఆరోగ్యానికి సంబంధం

ఆకలి ఆరోగ్యానికి సంబంధం


ఆరోగ్యంగా ఉండే వారిలో ఉండవలసిన మరొక ముఖ్యమైన లక్షణం సరైన ఆకలి కావడం. నిజమైన ఆకలి అంటే పెట్టింది శుభ్రంగా తినడం, ఆ తర్వాత ఎటువంటి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు లేకుండా తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం. ఇక ప్రతిరోజూ చక్కగా ఆకలి వేసే వారికి, తిన్న ఆహారం అరిగించుకునే వారికి ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉన్నవారికి ఉండవలసిన లక్షణాలలో అతి ప్రధానమైన లక్షణం అని వైద్యులు చెబుతున్నారు.

చేసే పనికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం

చేసే పనికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం


మీరు చేస్తున్న పని ఎంజాయ్ చేస్తున్నారా లేదా? మీరు దాంట్లో మానసికంగా తృప్తిని పొందుతున్నారా లేదా అన్నది కూడా పరిశీలించుకోవాలి. మనం చేసే పని మనసుకు ఇష్టం లేకపోతే, అది మన మనసును బాధిస్తుంది. మానసికంగా ఆరోగ్యం లేకపోతే, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండము. కాబట్టి చేస్తున్న పనిని ఎంజాయ్ చేసేలా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టేనని చెబుతున్నారు.

 ఛాతీ చుట్టుకొలత, పొట్ట చుట్టుకొలత ఎలా ఉండాలంటే

ఛాతీ చుట్టుకొలత, పొట్ట చుట్టుకొలత ఎలా ఉండాలంటే


ఇక ఆరోగ్యవంతులలో ఉండవలసిన మరొక ముఖ్యమైన లక్షణం వారి పొట్ట చుట్టుకొలత కన్నా, ఛాతీ చుట్టుకొలత ఎక్కువగా ఉండాలి. ఛాతీ కన్న పొట్ట చుట్టుకొలత ఎక్కువగా ఉంటే వారు ఆరోగ్యంగా లేనట్టే. పొట్ట కన్నా చాతీ చుట్టుకొలత ఎక్కువగా ఉంటే, పొట్ట కొలత తక్కువగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్టు అని, ఇది ఆరోగ్యవంతుల్లో ఉండే మరొక ముఖ్యమైన లక్షణం అని వైద్యులు చెబుతున్నారు.

 ఎప్పుడూ సంతోషంగా ఉండడంతో ఆరోగ్యానికి లింక్

ఎప్పుడూ సంతోషంగా ఉండడంతో ఆరోగ్యానికి లింక్


ఇక చీటికీ మాటికీ కోపం లేకుండా, అందరితో కలిసి వెళ్ళి పోతూ, ఎప్పుడూ సంతోషంగా ఉండడం ఆరోగ్యవంతుల మరొక ముఖ్యమైన లక్షణం అని చెబుతున్నారు. అలా ఉండలేని వారంతా ఏదో అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టే అని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతులు ఎప్పుడూ సంతోషమైన జీవితాన్ని, ఆనందంగా ఎలాంటి చికాకులు లేకుండా గడుపుతారు.

 6 ఆరోగ్య లక్షణాలు ఉంటే.. ఆరోగ్యం మీ సొంతం

6 ఆరోగ్య లక్షణాలు ఉంటే.. ఆరోగ్యం మీ సొంతం


మొత్తానికి బాగా నిద్ర పోవడం, సరిగ్గా ఆకలి వేయడం తోపాటు తిన్న ఆహారం ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణం కావడం, రోజూ మల విసర్జన సాఫీగా కావడం, పొట్ట కన్నా ఛాతీ చుట్టుకొలత ఎక్కువగా ఉండటం, చేసే పనిని ఎంజాయ్ చేయడం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు ఆరోగ్యవంతులని గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకుంటే వాటిని సాధించడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
naturopathy doctors says six main symptoms of being healthy. good sleep, good appitite, regular bowel movements, chest bigger than stomach, happy working nature, happiness, are the healthy sympotoms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X