మహత్తరమైన మోక్ష ఏకాదశి, గీతా జయంతి- మీ జాతకాలు మారే రోజు..

హిందూ ధర్మంలో ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మోక్షద ఏకాదశి రోజును మరింత విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ రోజున చేసే పూజలు, దానాలు పూర్వీకులకు మోక్ష మార్గాన్ని చూపుతాయని నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఎంతో శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పురాణాల ప్రకారం, మోక్షద ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశించాడు. అందుకే దీనిని గీతా జయంతి అని కూడా అంటారు.

గీతా జయంతిని జ్ఞానం, సద్బుద్ధి, ఆధ్యాత్మిక జాగృతికి ప్రతీకగా భావిస్తారు. ఈ రోజు చేసే పూజలు నేరుగా శ్రీమహావిష్ణువుకు చేరుతాయని, ఏ చిన్న పొరపాటు కూడా పూజ ప్రభావం తగ్గిస్తుందని నమ్ముతారు. 2025లో మోక్షద ఏకాదశి అత్యంత శుభప్రదమైన యోగంలో వస్తుంది. ఈ గీతా జయంతి/ మోక్ష ఏకాదశి నాడు గ్రహాల స్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్రతం, పూజ, దానం, సంకల్పం తీసుకుంటే ఫలితాలు ఎన్నో రెట్లు అధికంగా లభిస్తాయి. గీతా జయంతి కూడా ఇదే రోజున కావడం వల్ల ఈ రోజు మరింత పవిత్రంగా పరిగణిస్తారు.

మోక్షద ఏకాదశి రోజున చేయకూడని పనులు..

1. ధాన్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం: ఏకాదశి రోజున ధాన్యం తినడం పాపంగా పరిగణిస్తారు. ముఖ్యంగా మోక్షద ఏకాదశి రోజున ధాన్యం, బియ్యం, పప్పులు, శనగలు, రాజ్మా, మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయల వంటి తామస ఆహారాలను తీసుకోకూడదు. వీటిని తినడం వల్ల వ్రతం నిష్ఫలమవుతుంది. వ్రత ఫలం సిద్ధించదు. మానసికంగా అస్థిరత, ఇంట్లో ఒత్తిడి కలుగుతాయి.

2. గొడవలకు దూరం: గీతా జయంతి/ మోక్షద ఏకాదశి అంటే మనస్సును శుద్ధీకరించడం. ఆత్మ ఉద్ధరణ జరగడం. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పేది కూడా ఇదే. ఈ రోజున కోపగించుకోవడం, ఇతరులతో గొడవపడటం లేదా దుర్భాషలాడటం అతి పెద్ద దోషంగా భావిస్తారు.

3. ఏకాదశి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం: మోక్షద ఏకాదశి రాత్రి జాగరణ లేదా కనీసం సాత్విక మనస్సుతో సమయం గడపడం చాలా శుభప్రదం. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల పుణ్యఫలం తగ్గిపోతుంది, మానసిక ఒత్తిళ్లు కలుగుతాయి. గీతా పఠన ప్రాముఖ్యత తగ్గుతుంది. ధన వృద్ధికి సంబంధించిన యోగాలు బలహీనపడతాయి.

4. గీతా పఠనం చేయకపోవడం: మోక్షద ఏకాదశి గీతా జయంతి కావడంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున గీతా పఠనం లేదా కనీసం ఒక అధ్యాయం చదవడం తప్పనిసరి. మోక్షద ఏకాదశి రోజున గీతా పఠనం ఎన్నో జన్మల అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుందని అంటారు.

5. తులసిని అగౌరవపరచడం: తులసి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ఏకాదశి రోజున తులసి పూజ చేయాలి. తులసి ఆకులను తెంపవద్దు. తులసిని అశుభ్రమైన చేతులతో తాకవద్దు. తులసి మొక్క కింద ఎంగిలి నీరు పారపోయవద్దు. ఆ రోజున తులసీ కోట వద్ద దీపం వెలిగించాలి. విష్ణు మంత్రాలతో నైవేద్యాన్ని సమర్పించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+