చంద్రగ్రహణం నాడే రానున్న శ్రాద్ధ పౌర్ణమి: పితృ రుణం తీర్చుకునే చక్కటి అవకాశం

శ్రాద్ధ పూర్ణిమ ఈ నెల 7న రానుంది. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహిస్తారీ రోజున. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. శ్రాద్ధ పూర్ణిమను శ్రాద్ధి పూర్ణిమ లేదా ప్రోష్ఠపది పూర్ణిమ శ్రాద్ధ అని కూడా పిలుస్తారు. ఇది భద్రపద పూర్ణిమ తిథి నాడు వస్తుంది. పితృ పక్షానికి ముందు వచ్చినప్పటికీ- ఇదొక ఒక ప్రత్యేక ఆచారంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.

శ్రాద్ధ పూర్ణిమ తిథి 7వ తేదీ వేకువ జామున 1:41 నిమిషాలకు ప్రారంభౌతుంది. అదే రోజు రాత్రి 11:38 నిమిషాలకు ముగుస్తుంది. శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి అనుకూలమైన ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. దీన్ని కుతూప ముహూర్తంగా పిలుస్తారు. రోహిణ ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి మధ్యాహ్నం 01:35 వరకు ఉంటుంది. అపరాహణ కాలం మధ్యాహ్నం 1:35 నుండి సాయంత్రం 4:06 నిమిషాల వరకు కొనసాగుతుంది.

ఈ సమయాలు పూర్వీకులకు తర్పణాలు, ప్రార్థనలు సమర్పించడానికి అత్యంత ప్రభావవంతమైనవిగా భావిస్తారు. ఈ రోజున శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా, భక్తులు తమ మరణించిన కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి లభిస్తుందని, వారి ఆశీర్వాద బలం మెండుగా ఉంటుందని నమ్ముతారు. మహాలయ శ్రాద్ధం అమావాస్య తిథి నాడు చేయడం ఆనవాయితీగా వస్తోంది. భద్రపద పూర్ణిమ శ్రాద్ధం ప్రత్యేకంగా పౌర్ణమి నాడు చేస్తారు. పితృ పక్షానికి ఒక రోజు ముందు వచ్చినా, ఇది క్రతువులో భాగం కాదు.

శ్రాద్ధ పూర్ణిమ రోజున పూర్వీకులక కర్మలను చేయడం వల్ల పితృ రుణం తీరుతుందని విశ్వసిస్తారు.ఆ రోజున తెల్లవారు జామునే స్నానం చేయాలి. తమ పూర్వీకులను తలచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారం, నువ్వులను సమర్పించాలి. సంప్రదాయబద్ధంగా భక్తి ప్రమత్తులతో శ్రాద్ధ కర్మలను నిర్వహించాలి. నువ్వులు కలిపిన గంగాజలాన్ని తర్పణంగా వదలాలి. బ్రాహ్మణులకు కూరగాయాలు, కొత్త దుస్తులు, నిత్యావసర వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+