వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Stones in Kidneys: రాళ్లు కిడ్నీల్లోనే కాదు.. శరీరంలోని ఇతర భాగాల్లో కూడా..

|
Google Oneindia TeluguNews

రాళ్లు వచ్చాయంటే.. చాలా మంది కిడ్నీల్లో వచ్చాయని అనుకుంటారు. అయితే రాళ్లు కిడ్నీల్లోనే కాకుండా ఇతర భాగాల్లో కూడా ఏర్పడతాయ. సాధారణంగా కిడ్నీల్లో ఎక్కువగా రాళ్లు వస్తుంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్య సర్వ సాధారణమే.. ఎందుకంటే చాలా మంది ఆహారపు అలవాట్ల వల్ల ఇలా జరుగుతుంది.

ఆహారపు అలవాట్లు

ఆహారపు అలవాట్లు

జీవనశైలి సరిగ్గా లేకపోవడం, అధిక బరువు, మందులు ఎక్కువగా వాడటం, ఆహారపు అలవాట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది రాళ్ల సమస్యకు ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అయితే ఈ రాళ్లు మళ్లీ మళ్లీ రావడానికి అవకాశం ఉంది. అందుకే సరైన ఆహారపు అవాట్లతో ఈ ప్రమాదాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది.

మూత్రాశయం

మూత్రాశయం


కిడ్నీల్లో కాకుండా మూత్రాశయంలో కూడా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. శరీరంలోని మినరల్స్ కఠినంగా మారినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుందట. దీంతో మూత్రం వెంటవెంటనే రావడం, మూత్రం పోసేటప్పుడు ఇబ్బంది నొప్పి పుట్టడం, మూత్రంలో రక్తం రావడం జరిగుతుంది.

పిత్తాశయం

పిత్తాశయం


పిత్తాశయం సంచిలో కూడా రాళ్లు ఏర్పడతాయి. పిత్తాశయం సంచి అనేది లివర్‌కు కుడివైపు దిగువన ఉంటుంది. పిత్తాశయం నాళికలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పిత్తాశయం సంచిలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు అది రాయిగా మారుతుందని వివరిస్తున్నారు

English summary
Apart from the kidneys, stones can also occur in some parts of the body. Gallbladder stones are also possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X