మనదేశంలో మగవారికి ప్రవేశం లేని ఆలయాలు ఉన్నాయంటే నమ్ముతారా?

భారత్ లో లక్షల సంఖ్యలో ఆయాలు ఉన్నాయి. ఆలయాలు లేని గ్రామం అనేది ఉండదనడంలో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, పూజా విధానాలను అనుసరిస్తుంటారు భారతీయులు. కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం ఉండదు. అలాగే, కొన్ని ఆలయాల్లో పురుషులకు కూడా ప్రవేశ నిషేధం ఉంది.

శబరిమల ఆలయం, రాణక్‌పూర్ జైన దేవాలయం, అస్సాంలోని పటబౌసి ఛత్ర వంటి అనేక ఆలయాల్లో మహిళలకు ప్రవేశం నిషేదం. అదేవిధంగా- కొన్ని దేవాలయాల్లో పురుషుల ప్రవేశంపైనా ఆంక్షలు ఉన్నాయి. పురుషులు ప్రవేశించని ఆలయాలు భారత్ లో కొన్ని ఉన్నాయి.

ఈ ప్రత్యేక ఆలయ ప్రాంగణాల్లో, నిర్దుష్ట రోజులలో మహిళల ఆధిపత్యం ఉంటుంది. పూజలు నిర్వహించడానికి మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీటిని 'మహిళలకు మాత్రమే దేవాలయాలు' అని పిలుస్తారు. పురుషులకు ప్రవేశం లేని భారతదేశంలోని దేవాలయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

అట్టుకల్ భగవతి ఆలయం, కేరళ

కేరళలోని అట్టుకల్ భగవతి దేవాలయం. పార్వతీదేవి వెలిసిన ఆలయం ఇది. ఇక్కడ మహిళల ఆధ్వర్యంలో ఏటా ఉత్సవాలు జరుగుతాయి. వేలాది మంది మహిళలు ఇందులో పాల్గొంటారు. దీనిని ప్రత్యేకంగా 'అట్టుకల్ పొంగల్' అని పిలుస్తారు.

ఈ ఉత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 10 రోజుల పాటు అంటే ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య జరిగే ఈ ఉత్సవంలో పురుషులకు ప్రవేశం పూర్తిగా నిషిద్ధం.

బ్రహ్మదేవాలయం, రాజస్థాన్

బ్రహ్మదేవునికి దేవాలయం ఉందా అని ఆశ్చర్యపోవచ్చు. ఆ చతుర్ముఖుడికి చాలా అరుదుగా దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉంది. ఈ ప్రసిద్ధ బ్రహ్మదేవాలయంలో వివాహితులైన పురుషులకు ప్రవేశం లేదు. గర్భగుడిలోకి వెళ్లి దేవుడిని పూజించడం నిషిద్ధం. ప్రధాన దైవం పురుషుడే అయినప్పటికీ, ఈ ఆలయంలో ఈ నియమం కఠినంగా అమలులో ఉంది.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. బ్రహ్మదేవుడు తన భార్య సరస్వతితో కలిసి యాగం చేయాల్సి ఉండగా, సరస్వతి ఆలస్యంగా రావడంతో బ్రహ్మ గాయత్రి దేవిని వివాహం చేసుకున్నాడు. దీనితో కోపించిన సరస్వతి ఏ వివాహిత పురుషుడు లోపలి గర్భగుడిలోకి ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే వారి వైవాహిక జీవితంలో అడ్డంకులు వస్తాయి అని శపించిందని చెబుతారు.

మాతా దేవాలయం, ముజఫర్‌నగర్

ముజఫర్‌నగర్‌లో ప్రసిద్ధ మాతా దేవాలయం. అస్సాంలోని కామాఖ్య దేవాలయం మాదిరిగానే, ఈ ఆలయంలో అమ్మవారికి రుతుస్రావం అవుతుందని నమ్ముతారు. ఈ సమయంలో పురుషులు దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించడం నిషేధం. మహిళలకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. నియమాలు ఎంత కఠినంగా ఉంటాయంటే- శుభ సమయాల్లోనూ పూజారులకు కూడా ఆలయ ప్రాంగణంలోకి అనుమతి ఉండదు.

దేవి కన్యాకుమారి ఆలయం, కన్యాకుమారి

తమిళనాడులోని కన్యాకుమారి ఆలయంలో కూడా పురుషులకు ప్రవేశం ఉండదు. దేవి కన్యాకుమారి వెలిసిన ఆలయం ఇది. ఈ ఆలయంలో ప్రవేశించడానికి ఏ సమయంలోనూ పురుషులకు అనుమతి ఉండదు. వివాహిత పురుషులకు ఇక్కడ ప్రవేశం లేదు. సన్యాసం స్వీకరించిన వారు మాత్రమే అమ్మవారిని దర్శించగలరు.పురాణాల ప్రకారం, సతి కుడి భుజం, వెన్నెముక భాగం ఈ కన్యాకుమారి ఆలయం ఉన్న ప్రదేశంలో పడిందని నమ్ముతారు. ఇది ఒక ప్రసిద్ధ శక్తిపీఠం.

కామాఖ్య ఆలయం, అస్సాం

అస్సాంలోని కామాఖ్య దేవాలయం గురించి చాలామందికి తెలిసిందే. ఇది అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠం. ఇక్కడ సంవత్సరంలో కొన్ని రోజులు పురుషులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. పూజారులకు కూడా నిషేధం వర్తిస్తుంది.

ఈ ఆలయం అంబుబచి మేళాను నిర్వహిస్తుంది. ఈ సమయంలో దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దేవత రుతుస్రావం అవుతుందని నమ్ముతున్న కారణంగా ఆలయం ప్రధాన ద్వారం నాలుగు రోజుల పాటు మూసివేస్తారు. ఈ సందర్భంలో పురుషులకు దేవాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+