భార్యాపిల్లల విషయంలో పురుషులు చెయ్యకూడనివి ఇవే!!
ఇంట్లో భార్య పిల్లలు విషయంలో పురుషులు ఏ విధంగా ఉండాలి? పురుషులు ఏ విధంగా ఉంటే ఆ ఇంట్లో స్త్రీలు సంతోషంగా ఉంటారు? ఆడవాళ్ళ విషయంలో మగవాళ్ళు చేయవలసిన ఏమిటి? చేయకూడనివి ఏమిటి? వంటి అనేక విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

భార్యా, పిల్లలతో ప్రవర్తించేటప్పుడు మగవాళ్ళు ఇలా ఉండాలి
చాలామంది మగవాళ్లకు ఇంట్లో భార్య పిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెలీదు. వారి కోసం ఏం చెయ్యాలో అంతకంటే తెలీదు. భార్యను పది మంది ముందు కోప్పడటం మగతనం అని ఫీలయ్యే వాళ్ళు ఉన్నారు. ఇక భార్యల అడుగులకు మడుగులొత్తే వాళ్ళు ఉన్నారు. ఏదైనా భార్యా, పిల్లల విషయంలో మగవాళ్ళు అతిగా ప్రవర్తించటం మంచిది కాదని అంటున్నారు. మగవాళ్ళు బ్యాలెన్స్ గా ఉంటే కుటుంబ జీవితం కూడా సాఫీగా సాగిపోతుందని అంటున్నారు. అయితే భార్యా పిల్లలతో ప్రవర్తించే టప్పుడు మగవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కొన్ని బేసిక్ విషయాలను అర్థం చేసుకోవాలని తెలుస్తుంది.

భార్య విషయంలో మగవాళ్ళు చెయ్యకూడనివి ఇవే
ముఖ్యంగా మగవాళ్ళు భార్యను హక్కుగా భావించి తిట్టకూడదని చెప్పబడింది. అంతే కాదు భార్య బంధువులతోనూ, ఆమె తల్లిదండ్రుల తోనూ కయ్యానికి కాలు దువ్వడం మంచిదికాదని చెప్పబడింది. మగవాళ్ళు ఎప్పుడు ఇంట్లో భార్య వడ్డించిన పదార్థాలను విస్మరించకూడదు. అంతేకాదు మగవాళ్ళు ఎప్పుడూ ఇంటిని భార్య జైలులా భావించే పరిస్థితులు కల్పించకూడదు. అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా భార్యను బయటికి తీసుకుని వెళ్లాలి. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని ప్రవర్తించాలి. భార్య అభిప్రాయానికి కూడా గౌరవం ఇవ్వాలి.

పిల్లల విషయంలో పురుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
మగవాళ్ళు పిల్లలతో మాట్లాడేటప్పుడు సరళంగా మాట్లాడాలి. పిల్లల ముందు ఏది పడితే అది మాట్లాడకూడదు. పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ప్రవర్తించకూడదు. ఎప్పుడూ పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ పెరుగుతారు కాబట్టి, ముఖ్యంగా మగవాళ్ళు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. భార్యకు ఎంతో కొంత ఆర్థిక స్వాతంత్రం కూడా ఇవ్వాలి. భార్య పై అజమాయిషీ చేయడానికి అనవసరమైన విషయాలకి కోప్పడటం చెయ్యకూడదు.

భార్యతో ఏకాంతం .. పిల్లలతో జాగ్రత్త
ఇక ఒక్కటే గదిలో కాపురం ఉండే దంపతులు పిల్లలను గమనిస్తూ వారిని మంచిగా పెంచడానికి తగినట్టుగా ప్రవర్తించాలి. వారు లేని సమయంలో భార్య భర్తలు శృంగార జీవితాన్ని ఆస్వాదించాలి. భార్యతో ఏకాంతం విషయంలో మగవాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లల ముందు ఏది పడితే అది చేయకూడదు. భార్యను సంతోషంగా చూసుకోవటంలో అలాగే భార్యకు సముచిత స్థానం ఇవ్వటంలో , పిల్లల విషయంలో భర్తగా ఉండే పురుషుడు ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటే, తదనుగుణంగా ప్రవర్తిస్తే ఆ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications