వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Piles: పైల్స్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి చాలు..

|
Google Oneindia TeluguNews

ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది పైల్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి పైల్స్ వస్తే నరకయాతన ఉంటుంది. ఒకే చోట కదలకుండా కూర్చోలేక.. సరిగ్గా నడవలేక.. బాధపడుతుంటారు. పైల్స్‌ను మన భాషలో అర్శమొలలు అంటారు. మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి. అవి రక్తంతో నిండి పిలకల్లా మలద్వారం గుండా బయటకు పొడుచుకు వస్తాయి. వీటినే పైల్స్ అంటారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పైల్స్‌ రెండు రకాలు ఉంటాయట..

పైల్స్‌ రెండు రకాలు ఉంటాయట..

ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపుకు గురవడం వలన ఇవి ఏర్పడుతాయట. ఇంటర్నల్ పైల్స్ వస్తే నొప్పి ఎక్కువగా ఉండదట. పైల్స్‌ మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపుకు గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకొని రావడాన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటారు. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి. చేతికి తాకిట్లు కూడా అనిపిస్తుందట. ఎక్స్‌టర్నల్ పైల్స్ వల్ల తీవ్ర నొప్పి ఉంటుందట. రక్తం కూడా వస్తుందట.

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రై చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుందట. మలబద్దకం సమస్య ఉన్న వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గట్టి గట్టిగా దగ్గే వారికి కూడా అర్శమొలలు వచ్చే అవకాశం ఉందట. మలవిసర్జన బలవంతగా చేసేవారు వాకి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది గర్భిణులకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందట.

వేడిని పుట్టించే ఆహార పదార్థాలు

వేడిని పుట్టించే ఆహార పదార్థాలు

అర్శమొలల సమస్య ఉన్న వారు ఒంట్లో వేడిని పుట్టించే ఆహార పదార్థాలను అస్సలు తినకూడదట. పైల్స్ ఉన్నవారు పచ్చళ్లు, చింతపండు, కారం, ఊరగాయలు, మాసాలలకు దూరంగా ఉంటే మంచిది. ఈ వ్యాధి సోకిన వాళ్లు ఎక్కువగా కాయకూరలు, ఆకు కూరలు వంటి పీచు పదార్థం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలట. నీళ్లను ఎక్కువగా తాగాలి. మొదటి నుంచి నీళ్లను ఎక్కువగా తాగే వారికి అర్శమొలలు వచ్చే అవకాశం చాల తక్కువగా ఉంటుందట. పైల్స్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోవడాన్ని పూర్తిగా మానేయాలి.

English summary
Those who get piles should drink more water. Also do not take junk food, processed food, fried food. Eat more vegetables.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X