వాస్తు ప్రకారం.. వంట వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అలా చేస్తేనే

లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఉన్న వారికి జీవితంలో ఏ ఆర్థిక సమస్యలూ ఉండవని ప్రగాఢ నమ్మకం. అలాంటి వారు జీవితాంతం అపార సంపద, సౌభాగ్యాన్ని పొందుతారని విశ్వసిస్తారు. గరుడ పురాణంలో కొన్ని ప్రత్యేకమైన క్రియలు ఉన్నాయి.. వీటిని ఆచరించే వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో సానుకూల శక్తి లభిస్తుంది, ప్రతికూల శక్తులు దూరమవుతాయి. ఈ పనులను నిత్యం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

1. కులదైవాన్ని పూజించండం

ప్రతి హిందూ కుటుంబానికి ఒక నిర్దుష్టమైన కులదైవం ఉంటుంది. వారు తమ కులానికి సంబంధించిన దేవతలను లేదా దైవాన్ని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. గరుడ పురాణం ప్రకారం మనం ప్రతిరోజూ మన కులదైవాన్ని తప్పకుండా పూజించాలి. నిరంతర కులదైవ పూజ వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించిపోతాయి. ఆ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా, సంపన్నంగా ఉంటుంది. కులదైవారాధన ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని నమ్ముతారు.

Vaastu Goddess Lakshmi Devi Rituals Pooja Vidhanam as per Garuda Purana For Wealth And Prosperity

2. స్నానం చేయకుండా ఆహారం వండవద్దు:

హిందూ ధర్మంలో వంటగదిని అత్యంత పవిత్రమైన స్థలంగా, అన్నపూర్ణాదేవి కొలువై ఉండే ప్రదేశంగా భావిస్తారు. అటువంటి పవిత్రమైన స్థలంలో స్నానం చేయకుండా ఆహారం వండకూడదని గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొంది. ముహూర్త కాలంలో స్నానం చేసి, శారీరక, మానసిక శుద్ధితో వంటగదిలోకి ప్రవేశించాలి. వంట చేయడానికి ముందు, వంటగదికి, పొయ్యికి పూజ చేసి, కుటుంబానికి వడ్డించే ముందు ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అన్నపూర్ణాదేవితో పాటు లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది, ఇంటికి సిరిసంపదలు కలుగుతాయి.

3. నిత్య పూజ, మంత్ర పఠనం:

ఏ ఇంటి పూజగదిలో ప్రతిరోజూ దేవత- దీపారాధన, పూజలు జరుగుతాయో, నిత్యం మంత్రాలు జపిస్తారో.. ఆ ఇల్లు లక్ష్మీదేవి నివాసంగా పరిగణిస్తారు. ఆదివారం మినహా, ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు సమర్పించే ఇల్లు లక్ష్మీనారాయణుల నిలయంగా మారుతుంది. ఇంట్లో ప్రతిరోజూ ఈ పనులన్నీ చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్మకం.

4. పశు- పక్షులకు ఆహారం అందించండి:

ఇంట్లో ప్రతిరోజూ ఆహారాన్ని తయారుచేసినప్పుడు, మొదట దాన్ని కొంతభాగం ఆవులకు లేదా కుక్కలకు పెట్టాలి. ప్రతిరోజూ పశువులకు, పక్షులకు ఆహారం అందించడం వల్ల ఆ ఇంటిపై లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది. అంతేకాకుండా, శనీశ్వరుడి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.

గరుడ పురాణం ప్రకారం, ఈ పనులు నిత్యం చేయడం వల్ల ఇంటిలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో తలెత్తే సమస్యలు, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఇలాంటి పుణ్యకార్యాలు చేసే ఇళ్లలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై, తన భక్తుల సమస్యలను దూరం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+