గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

16 మంది రాజధాని రైతుల అరెస్ట్: మాట్లాడుదామని పిలిచి: రెండు ప్రాంతాలకు తరలింపు..!

|
Google Oneindia TeluguNews

రాజధాని అమరావతి రైతుల అరెస్ట్ లు కొనసాగతున్నాయి. కొద్ది రోజుల క్రితం మీడియా పైన దాడి కేసులో ఆరుగురు స్థానికులను అరెస్ట్ చేసిన పోలీసులు ..తాజాగా 16 మందిని అరెస్ట్ చేసారు. మాట్లాడాలని.. రాజధాని గ్రామాల్లోని రైతులను పిలిచి అరెస్ట్ చేసినట్లుగా చెబుుతున్నారు. వీరిని ఏ విషయంలో అరెస్ట్ చేసారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మందడం.

అమరావతి రైతులకు అండగా బాలకృష్ణ: పండుగకు చంద్రబాబు దూరం: పోరాటానికి మద్దతుగా..!అమరావతి రైతులకు అండగా బాలకృష్ణ: పండుగకు చంద్రబాబు దూరం: పోరాటానికి మద్దతుగా..!

వెలగపూడి..మల్కాపురం గ్రామాలకు చెందిన 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే, వారందరినీ ఒక చోటే ఉంచకుండా.. పది మందిని చిలకలూరి పేట లోనూ..మరో ఆరుగురిని తెనాలికి తరలించారు. ఈ వ్యవహారం పైన రాజధాని ప్రాంత స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్లను అరెస్ట్ చేసారని..సరైన కారణాలు కూడా చెప్పటం లేదని వారు వాపోతున్నారు.

16 farmers from Amaravati villages arrested and shifted to Different areas

మూడు రాజధానులు.. అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 20 రోజులుగా రైతులు..స్థానికులు ఆందోళన కొన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా పలు సందర్భాల్లో పోలీసులతో స్థానికులు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల నిబంధనల అమల్లోనూ స్థానికులు సహకరించటం లేదనే వాదన ఉంది. ఇక, ఇప్పుడు తాజాగా పోలీసులు అమరావతి ప్రాంతంలోని గ్రామాలకు చెందిన 16 మందిని అరెస్ట్ చేసారు. వారిని చిలకలూరిపేట..తెనాలి తరలించారు. కొద్ది రోజుల క్రితం మీడియా ప్రతినిధుల పైన దాడి వ్యవహారంలో ఆరుగురు స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసి తెనాలి తరలించారు. ఆ తరువాత కోర్టు ఆదేశం మేరకు రిమాండ్ కు పంపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా గుంటూరు జిల్లా జైలుకు వెళ్లి వారిని పరామర్శించారు. ఆ తరువాత వారు బెయిల్ మీద విడుదలయ్యారు. ఇక, ఇప్పుడు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసారనే అంశం పైన రాజధాని ప్రాంత వాసులు మండి పడుతున్నారు.

English summary
Amaravati area farmers 16 members arrested by polilce and shifted to Chilakaluripet and Tenali. Amaravati village people serious on arrests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X