పెద్దమ్మపై దారుణం... తీసుకున్న బంగారం అడిగిందని ట్రాక్టర్ ఎక్కించి హత్య
తన ఇంటిపక్కనే నివాసం ఉంటున్న చెల్లెలి కొడుకును తన కొడుకుగా భావించింది. చిన్నప్పటి నుండి ఏ కష్టం వచ్చిన నేనున్నాంటూ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ రోజు చెల్లెలి కోడుకు కష్టాల్లో ఉండడంతో తనకు డబ్బులు కావాలని అడిగాడు. దీంతో తన వద్ద సమయానికి డబ్బులు లేని పెద్దమ్మ తన ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసి ఇచ్చి తాకట్టుపెట్టుకోమని ఇచ్చింది.
అయితే బంగారాన్ని తాకట్టుపెట్టుకుని అవసరాలు తీర్చుకున్న కొడుకు మాత్రం పెద్దమ్మ... అని చూడకుండా కర్కశంగా వ్యవహరించాడు. అవసరం తీరిన తర్వాత బంగారం తెచ్చి ఇవ్వమని ఆడిగిన పెద్దమ్మపై దారుణంగా వ్యవహరించాడు. బంగారం కోసం అడ్డువచ్చిన పెద్దమ్మను ట్రాక్టర్‌తో తోక్కించి హత్య చేశాడు.

ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలంలోని కొత్తపాలెంలో చోటుచేసుకుంది. సుబ్బమ్మ అనే మహిళ ఇంటిపక్కనే ఉండే రాజశేఖర్ రెడ్డి తనకు చెల్లెలి కోడుకు. రాజశేఖర్‌రెడ్డికి డబ్బులు అవసరం ఉండడంతో సబ్బమ్మ వద్దకు వెళ్లి అడిగాడు. అయితే డబ్బులు లేని సుబ్బమ్మ తన వద్దనున్న బంగారాన్ని ఇచ్చింది. అయితే అవసరానికి బంగారం తీసుకుని తనాఖా పెట్టిన రాజశేఖర్ రెడ్డి తిరిగి వాటిని తీసుకువచ్చి తనవద్దే పెట్టుకున్నాడు.
దీంతో తన బంగారం ఇవ్వాలని సుబ్బమ్మ అడిగింది. తన ఇంటిముందు నుండి ట్రాక్టర్‌పై నుండి వెళుతున్న రాజశేఖర్ రెడ్డిని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గోల్డ్ ఇచ్చే వరకు ట్రాక్టర్ ముందునుండి కదలని సుబ్బమ్మ మొండికేయడంతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న రాజశేఖర్ రెడ్డి సుబ్బమ్మపై నుండి ట్రాక్టర్ పోనిచ్చాడు. దీంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం పారిపోతున్న రాజశేఖర్ రెడ్డిని స్థానికులు పట్టుకున్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications