గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయన గెడ్డంలోని వెంట్రుక కూడా పీక్కోలేరు: జగన్ రెడ్డి కామెడి నవ్వొస్తోంది: నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

అమరావతి: అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి.. పార్టీ నాయకులు అండగా ఉంటున్నారు. ఆయనకు నైతిక మద్దతు ప్రకటిస్తున్నారు. టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా పలువురు మాజీమంత్రులు ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసులేవీ నిలబడేవి కావనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులను ఇచ్చారంటూ మండిపడుతున్నారు.

చంద్రబాబు ఏం చేయబోతున్నారు? న్యాయ నిపుణులతో మంతనాలు: మరో స్టే కోసమేనా?చంద్రబాబు ఏం చేయబోతున్నారు? న్యాయ నిపుణులతో మంతనాలు: మరో స్టే కోసమేనా?

చంద్రబాబు గెడ్డం వెంట్రుక కూడా పీక్కోలేరంటూ..

చంద్రబాబు గెడ్డం వెంట్రుక కూడా పీక్కోలేరంటూ..

చంద్రబాబు నోటీసులను జారీ చేయడంపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఈ నోటీసులతో ఆయన గెడ్డంలో నెరిసిన వెంట్రుకను కూడా పీక్కోలేరని ఎద్దేవా చేశారు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లని నమ్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పడరాని పాట్లు పడుతున్నారని చురకలు అంటించారు. జగన్ రెడ్డి పడుతోన్న తిప్పలు చూస్తోంటే.. తనకు నవ్వొస్తోందంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ న్యాయస్థానం అనేక సార్లు చీవాట్లు పెట్టినప్పటికీ.. వైఎస్ జగన్ మారట్లేదని, పాత పాటే ఎన్నాళ్లు పాడతారని ప్రశ్నించారు.

అలసిన జగన్ రెడ్డి..

అలసిన జగన్ రెడ్డి..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబును కోర్టుకీడ్చే పనిలోనే వైఎస్ జగన్ పడ్డారు తప్ప.. అభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారని నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ 21 నెలల కాలంలో అమరావతిలో చంద్రబాబు అవినీతి కోసం శోధించి జగన్ రెడ్డి అలసిపోయాడని విమర్శించారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారని ధ్వజమెత్తారు. సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరని ఎదురుదాడికి దిగారు.

అమరావతిని అంతం చేయలేరు..

అమరావతిని అంతం చేయలేరు..


అమరావతిని అంతం చేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా అవి ఫలించబోవని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. అమరావతి దైవభూమి అని, తనను తానే కాపాడుకుంటుందని అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. తన ట్వీట్లకు సీఐడీ అధికారులు చంద్రబాబుకు అందజేసిన నోటీసుల కాపీలను జత చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ కోర్టు పలుమార్లు జగన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించిందని, అయినప్పటికీ పట్టించుకోకుండా.. సుప్రీంకోర్టు దాకా వెళ్లారని అన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహరంలో ప్రభుత్వం ఎక్కడికెళ్లినా..చుక్కెదురవుతుందని చెప్పారు.

రాజకీయ కక్షసాధింపు చర్యే..

రాజకీయ కక్షసాధింపు చర్యే..

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారని, ఆయన బాధితుడా? అంటూ ఇప్పటికే పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏ ఒక్క దళితుడైనా తాము బాధితులమంటూ ఫిర్యాదు చేశారా? అని నిలదీశారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పెట్టడంలో అర్థం లేదని, రాజకీయ కక్షసాధింపుతోనే ఆయనకు నోటీసులు ఇచ్చారనేది స్పష్టమౌతోందని వ్యాఖ్యానించారు. భూ సమీకరణ చోటు చేసుకున్న ఆరేళ్ల తరువాత సీఐడీ నోటీసులు ఇవ్వడం కక్షసాధింపు కాదా? అని ప్రశ్నించారు.

English summary
Telugu Desam Party National General Secretary and former minister Nara Lokesh slams YS Jagan government for serve notice to Party Chief Chandrababu Naidu in Amaravati land scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X