దేవుడి సన్నిధిలో లేని రక్షణ.. పొలాల్లోకి లాక్కెళ్లే యత్నం, ప్రతిఘటించిన మహిళ..
పల్నాడులో దారుణ ఘటనలు జరుగుతున్నాయి. దుగ్గిరాలలో ఓ మహిళపై హత్యాచారంపై దుమారం కొనసాగుతూనే ఉంది. సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తిరిగి అదే జిల్లాలో మరో మహిళపై లైంగికదాడి చేయబోయారు. అయితే ఆమె కేకలు వేయడం.. కూలీలు రావడంతో రేప్ జరగలేదు. కానీ లేదంటే మరోసారి నీచానికి పాల్పడేవారు. అయితే ఆ సదరు యువతి ఆలయంలో నిద్రిస్తోండగా తీసుకెళ్లారు కామాంధులు. సో.. అతివకు ఆ భగవంతుడి సన్నిధిలో కూడా రక్షణ లేకుండా పోయింది.
గుంటూరు జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. దుగ్గిరాల మండలంలో మరో మహిళపై అత్యాచారయత్నం ఘటన దుమారం రేపుతోంది. ఓ మహిళ కూలీ పనుల కోసం దుగ్గిరాలకు వచ్చింది. అదే గ్రామంలో గల ఆలయంలో నిద్రిస్తోంది. ఇక్కడ రక్షణ లభిస్తోందని ఆమె అనుకుంది. కానీ ఆ దేవుడి సన్నిధిలో కూడా రక్షణ లేకుండా పోయింది. అటుగా వెళుతున్న అల్లరి మూక కన్ను ఆమెపై పడింది. ఎలాగైనా అనుభవించాలని అనుకున్నారు. ఇంకేముంది ఆమెను తీసుకొని పోవడానికి ప్రయత్నించారు.

అయితే అలికిడికి ఆమె లేచింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకుంది. వెంటనే కేకలు వేసింది. దీంతో పొలాల్లోకి లాక్కెళ్లే వారి ఆలోచనకు బ్రేక్ పడింది. అలికిడితో వెంటనే తోటి కూలీలు లేచారు. డయల్ 100కు ఫోన్ చేశారు. సదరు యువకులపై ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. యువకులు వాడిన బైక్ ఆలయ సమీపంలో గుర్తించారు. బైక్ స్వాధీనం చేసుకున్నారు. బైక్ నెంబర్ ఆధారంగా యువకులను అదుపులోకి తీసుకుంటారు.
దిక్కులేని వారిని దేవుడే దిక్కు అని అంటారు. కానీ ఆమె భగవంతుడిపై భారం వేసింది. కునుకు తీసింది. కానీ కామాంధుల కళ్లు ఆమెపై పడ్డాయి. ఎలాగైనా అనుభవించాలని అనుకున్నారు. పొలాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ప్రతిఘటించడం.. కూలీలు రావడంతో రేప్ అటెంప్ట్ ఆగింది. లేదంటో మరో ఆబల కూడా లైంగికదాడి.. లేదంటే హత్యాచారానికి గురయ్యేది.