జ్యోతి ఉదంతం మర్చిపోకముందే.. మంగళగిరిలో మరో గ్యాంగ్ రేప్.. చినకాకానిలో అఘాయిత్యం..

ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మృగాళ్ల వేట కొనసాగుతూనేఉంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో వారం రోజుల వ్యవధిలోపే మరో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. చినకాకానిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదే మంగళగిరి మండలంలో ఈనెల 11న జ్యోతి అనే యువతిని దుండగులు అత్యాచారంచేసి హత్యచేసిన సంగతి తెలిసిందే.

వైసీపీతో లింకులంటూ..
మంగళగిరి మండలంలోని చినకాకానిలో మహిళపై అత్యాచారం జరిగినట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది. నేరానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులకు అధికార వైసీపీతో సంబంధాలున్నాయిని, అందుకే కేసును బయటికి రానీయకుండా పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. మంగళగిరి మండలపరిధిలోకే వచ్చే నవులూరులోనూ మరో యువతి గ్యాంగ్ రేప్, హత్యకు గురైంది.

another women gang raped in mangalagiri, police arrested three persons from chinakakani

ప్రేమికుల్ని అటకాయించి..
నవులూరులో జ్యోతి, శ్రీనివాస్ అనే ప్రేమ జంటపై ఈనెల 11న రాత్రి 9 గంటల ప్రాంతంలో నలుగురు యువకులు దాడిచేశారు. శ్రీనివాస్ ను బీరు సీసాలతో కొట్టి, జ్యోతిని ఈడ్చుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి చంపేసినట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఈ ఉదంతంలో శ్రీనివాస్ పాత్ర కూడా ఉందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో యువతి మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ కేసు విచారణలో ఉండానే తాజాగా మరో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+