గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్ దంపతులు... గుంటూరు భారత్‌పేట సచివాలయంలో...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం(ఏప్రిల్ 1) కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన టీకా తీసుకున్నారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం ఇద్దరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయంలోని వాలంటీర్లు,అక్కడి వైద్య సిబ్బందితో మాట్లాడారు.

దేశవ్యాప్తంగా గురువారం(ఏప్రిల్ 1) కరోనా వ్యాక్సినేషన్ మూడో విడత ప్రారంభమైంది. ఇందులో భాగంగా 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సినేషన్ రెండో దశలో 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకనుంచి దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినా 45 ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

cm ys jagan takes first shot of covid 19 vaccine in guntur

వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం సమీప వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లవచ్చు. లేదా కోవిన్‌ పోర్టల్‌లో రిజస్టర్‌ చేసుకోవచ్చు. ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా కూడా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులు,క్లినిక్స్‌లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక డోసుకు రూ.250 చార్జి చేస్తారు.

మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవో డాక్టర్‌ ఆర్‌ఎస్‌ శర్మ, కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఏడాది జనవరిలో దేశంలో మొదటి దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి విడతలో హెల్త్‌కేర్‌ వర్కర్స్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇస్తున్నారు. తాజాగా మూడో దశలో 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేనివారికి కూడా టీకా ఇవ్వనున్నారు. దేశంలో ఇప్పటివరకూ 6.30కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.

English summary
Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy took coronavirus vaccine on Thursday in Gunur. He took the jab and formally kick-started the vaccination centre in Bharath Pet area in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X