గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లారీతో గుద్ది చంపుతా కామెంట్స్: మంత్రివేనా, కొడాలి నానిపై దేవినేని ఉమా ఫైర్, జగన్ మెప్పుకోసమా..?

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రి కొడాలి నానిపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. బాధ్యతగల మంత్రి పదవీలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఈ నెల 4వ తేదీన వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో కొడాలి నాని మాట్లాడిన అంశాన్ని ప్రస్తావించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్‌తో కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని గుర్తుచేశారు.

లారీతో ఢీ కొట్టి చంపుతానని అనడం ఏంటీ..

లారీతో ఢీ కొట్టి చంపుతానని అనడం ఏంటీ..

తనను, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని లారీతో ఢీ కొట్టి చంపుతామని కామెంట్ చేయడం ఏంటీ అని ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని.. లేదంటే యాక్సిడెంట్ చేసి చంపేస్తా అని మంత్రి బెదిరించడం ఏంటన్నారు. మంత్రి కొడాలి నాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ఈ బెదిరింపుల్లో సీఎం జగన్‌కు కూడా భాగం ఉందని చెప్పారు. కొడాలి నాని ఎందుకు నోరు పారేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.

జగన్ మెప్పుకోసమేనా..?

జగన్ మెప్పుకోసమేనా..?

సీఎం జగన్ మెప్పు పొందటానికే అలా మాట్లాడుతున్నారా అని అడిగారు. అమరావతి రైతులు, దళితులు, న్యాయ విభాగంలో ఉన్నవారిని తిడితే కేసులు నమోదు కావడం లేదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని చెప్పడానికి ఇది ఉదహరణ అని చెప్పారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. నిన్న రాత్రి గుడివాడలో టీడీపీ నాయకులపై 20 మంది గుండాలు ఇంటిమీద దాడిచేసై ఇప్పటివరకు చర్యలు లేవన్నారు. దీనిని డీజీపీ సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేయాలని కోరారు.

Recommended Video

Jaishankar-Wang Meet మాస్కో వేదికగా India,China మధ్య ఏకాభిప్రాయం ! || Oneindia Telugu
ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొలేదు..

ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొలేదు..

తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదున్నారు. కానీ జగన్ ప్రభుత్వాన్నీ ప్రశ్నిస్తే చాలు రోజు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారని తెలిపారు. కృష్ణా జలాలు పులివెందులకు ఇచ్చినందుకే మాపై సీఎం జగన్‌కు కోపం కలిగి ఉంటుందని మండిపడ్డారు. అంతేకాదు తన భద్రతను కూడా తగ్గిస్తున్నారని దేవినేని ఉమా తెలిపారు. సీఎం జగన్ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. జగన్ పాలనలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై మీకు వారు బుద్ది చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

English summary
ex minister devineni uma slams minister kodali nani for threatening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X