గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కు వెళ్తే-డాక్టర్ నిర్వాకం-గుంటూరు జిల్లాలో ఘటన

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే వేల రూపాయలు ఖర్చవుతాయని భాపించిన ఓ మహిళ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పీహెచ్సీకి వెళ్లడమే ఆమెకు శాపమైంది. వైద్యుడి నిర్వాకంతో ఇప్పుడు ఆమె బాధితురాలిగా మారిపోయింది.

గుంటూరు జిల్లాలో ఈ నెల 2వ తేదీన ఓ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం నూతక్కి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రానికి వెళ్లింది. తన తండ్రితో కలిసి పీహెచ్ సీకి వెళ్లి డాక్టర్ ను సంప్రదించింది. అయితే ఆపరేషన్ చేయడానికి ముందు డాక్టర్ ఆమెకు మత్తుమందు ఇచ్చారు. అయితే ఆమెకు మత్తు ఎక్కకుండానే ఆపరేషన్ కోసం పొట్టను కోశారు. అయితే మత్తు మందు ఎక్కలేదని గుర్తించి మరోసారి ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా మత్తుమందు ఎక్కలేదు.

family planning operation to women fails in guntur district phc with doctors negligence

బాధ తట్టుకోలేక ఏడుస్తున్న మహిళను వైద్యుడు అదేమీ పట్టించుకోకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేశారు. రెండు రోజుల తర్వాత ఆమెను పరీక్షించేటప్పుడు పొట్టపై బలంగా కుట్లు వద్ద నొక్కడంతో కుట్లు ఊడిపోయాయి. అయినా అలాగే ఉంచి బ్యాండేజ్ వేశారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆపరేషన్ చేసిన చోట పెద్ద రంధ్రం ఏర్పడింది. దీంతో ఆపరేషన్ ఫెయిలైందని డాక్టర్ తో పాటు సదరు మహిళ కూడా గుర్తించింది. చివరికి డాక్టర్ కు ఏం చేయాలో తెలియక గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఆమెను రిఫర్ చేశారు. కరోనా కారణంగా అక్కడకు వెళ్లే పరిస్ధితి కూడా లేకపోవడంతో స్ధానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి సదరు మహిళ చికిత్స తీసుకుంటోంది. వైద్యుడి నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా.. ఆ కుటుంబ పరిస్థితి అయింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వైద్య చికిత్స ఆపరేషన్లు జరుగుతాయని ఆశాభావంతో వచ్చిన ఆ కుటుంబానికి వైద్యుల నిర్లక్ష్యంతో నిరాశ మిగిలింది. ఇప్పుడు ఆ మహిళకు వైద్యం చేయించేదుకు అప్పులు చేసి మరీ తండ్రి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.

ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి చికిత్స అందిస్తుంటే.. కొందరు వైద్యుల నిర్లక్ష్యం పేద ప్రజల పాలిటీ శాపంగా మారుతోంది.జిల్లా ఉన్నత వైద్య శాఖ అధికారులు ఈ ఘటనపై స్పందించి భవిష్యత్తులో రోగులకు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

English summary
a women visited phc in guntur district for family planning operation become victim with doctor's negligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X