TDP నాయకులకు పూజచేసినందుకు పూజారి సస్పెండ్
ఐదారు నెలల క్రితం నిదానంపాటి అమ్మవారి గుడిలో తనకు పూజలు చేసినందుకు పూజారిని సస్పెండ్ చేశారని బ్రహ్మారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
పల్నాడులో రాజకీయంగా ఆధిపత్యం కోసం బ్రహ్మనాయుడు, నాగమ్మ కాలం నుంచి తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గాల మధ్య వరకు పోరు మాత్రం మారడంలేదు. దశాబ్దాలు, శతాబ్దాలు గడుస్తున్నప్పటికీ రాజకీయ వైరం మాత్రం రెండు పక్షాలమధ్యే కేంద్రీకృతమవుతోంది. తాజాగా వైసీపీ, టీడీపీ మధ్య పోరు జరుగుతోంది. తాజాగా జరుగుతున్న ఆధిపత్య పోరులో టీడీపీ మాచర్ల ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి స్వయంగా ఒక విషయాన్ని వెల్లడించారు.
6 నెలల క్రితం నిదానంపాడు అమ్మవారి గుడికెళ్లినప్పుడు అక్కడ తనకు పూజలు చేసిన పూజారిని సస్పెండ్ చేశారని చెప్పారు. వీటిని ఏ రాజకీయమంటారు? గుడికి వెళ్లిన ప్రతివారికి ఆశీర్వాదం ఇవ్వాలి.. బయటవారు వస్తారు.. హైదరాబాద్ వారు రావొచ్చని, బెంగళూరు నుంచి తెలుగోళ్లు రావచ్చని కానీ ఆ పూజారిని కూడా సస్పెండ్ చేయడం అంటే చాలా దారుణంగా వ్యవస్థ ఉందని అర్థమవుతోందని మండిపడ్డారు.

మీడియాకి పల్నాడు ప్రాంతంలో స్వేచ్ఛ లేదని జూలకంటి ఆరోపించారు. కేబుల్ సంస్థలను కూడా కబ్జా చేస్తున్నారని, ఇవ్వకపోతే దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎన్నికలు రాకుండానే ఇలా ఉందని.. ఎన్నికలొస్తే వాతావరణం ఇంకెలా మారుతుందో అనే భయంతో ఇక్కడి ప్రజలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications