కరోనా వైరస్ బారిన పడిన వైసీపీ ఎంపీ: హోమ్ క్వారంటైన్: ఆరోగ్యం బాగుందంటూ

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలుకు కరోనా వైరస్ బారిన పడ్డారు. డాక్టర్ల సూచనతో ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనలో కరోనా వైరస్ లక్షణాలు కనపించలేదని, ఆరోగ్యం బాగుందని చెప్పారు. రెండు రోజులుగా తనన కలిసిన వారందరూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని విజ్ఙప్తి చేశారు.

లావు శ్రీకృష్ణ దేవరాయలు..గుంటూరు జిల్లాలోని నరసరావుపేట లోక్‌సభ స్థానానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై లక్షన్నరకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను పర్యవేక్షించడానికి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తరచూ పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Guntur: YSRCP MP Lavu Sri Krishna Devarayulu tests positive for Covid19

రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందు కరోనా నిర్దారణ పరీక్షలను చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగా.. బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో ఆయన వెంటనే హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాను త్వరగా కోలుకుంటానని చెప్పారు. గుంటూరు జిల్లాకే చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు అంబటి రాంబాబు రెండోసారి కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆయన కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ ఏడాది జులైలో తొలిసారిగా ఆయనకు కరోనా సోకింది. అనంతరం మళ్లీ అయిదు రోజుల కిందటే అంబటి రాంబాబుకు కరోనా సోకింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన కోవిడ్-19 టెస్టులలో పాజిటివ్‌గా తేలడంతో క్వారంటైన్‌లో ఉంటున్నారు. హోమ్ క్వారంటైన్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నారాయన. మరోసారి కరోనా వైరస్‌ను జయిస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+