గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో: టోల్‌గేట్ సిబ్బంది చెంప పగులగొట్టిన వైసీపీ మహిళా నాయకురాలు: వడ్డెర కార్పొరేషన్ నుంచి

|
Google Oneindia TeluguNews

గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు దేవళ్ల రేవతి టోల్‌గేట్ ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దురుసుగా ప్రవర్తించారు. వారితో వాగ్వివాదానికి దిగారు. రోడ్డుకు అడ్డంగా ఉంచిన ఇనుప బ్యారికేడ్లను పక్కకు లాగి పడేశారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. వీరంగం సృష్టించారు. గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ వద్ద చోటు చేసుకున్న ఘటన ఇది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె వైఖరి పట్ల నెటిజన్లు భగ్గుమంటున్నారు.

ఆమెపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన దేవళ్ల రేవతి.. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక నాయకురాలిగా గుర్తింపు పొందారు. కొద్దిరోజుల కిందటే ఆమె ఏపీ వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులు అయ్యారు. ఏపీ వడ్డెర సంక్షేమ సంఘం కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వం తనకు అధికారికంగా కేటాయించిన ఏపీ 36 ఏఏ 5678 నంబర్ కారులో లో విజయవాడకు బయలుదేరారు.

మార్గమధ్యలో కాజా టోల్‌గేట్ వద్ద ఆమె ఫీజు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించారు. దీనితో టోల్‌ప్లాజా సిబ్బంది ఆమె కారును అడ్డుకున్నారు. టోల్ ఫీజు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె అంగీకరించలేదు. సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. బ్యారికేడ్లను తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. దీనికి సిబ్బంది వినిపించుకోలేదు. ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. దీనితో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇనుప బ్యారికేడ్లను తోసి పక్కన పడేశారు.

Guntur: YSRCP woman leader Revathi slaps tollgate staff

తనతో వాగ్వివాదం చేసిన ఉద్యోగి చెంప పగులగొట్టారు. వారితో వాగ్వివాదాన్ని కొనసాగించారు. అక్కడే ఉన్న కొందరు ఉద్యోగులు దీన్ని సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైసీపీ మద్దతుదారులు సైతం ఆమె ప్రవర్తన పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వైఖరి ఉన్న నాయకులను ప్రోత్సహించకూడదని అంటున్నారు. ఆమెపై పోలీస్ కేసు పెట్టాలని సూచిస్తున్నారు.

Recommended Video

Vizag Pharma City Mishap: 50 అడుగుల వరకు మంటలు - భారీగా రసాయనాల నిల్వే కారణం... రియాక్టర్లు పేలి !

English summary
Ruling YSR Congress Party woman leader and AP Vaddera Corporation Chairperson Devalla Revathi slaps of Kaza tollplaza in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X