పల్నాడులో ఉద్రిక్తత: యరపతినేని కటౌట్‌పై రగడ.. తొలగించాలని, కిరోసిన్

ఆంధ్రప్రదేశ్ పల్నాడులో సోమ‌వారం ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పిడుగురాళ్ల‌లో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు అనుచ‌రుల్లో ఆందోళనకు దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ నెల 13వ తేదీన యరపతినేని బర్త్ డే.. సందర్భంగా కటౌట్ ఏర్పాటు చేశారు. దానిని తీసివేయాలని ఆదేశించడంతో యరపతినేని అనుచరులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. ఒక్క‌సారిగా అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

పిడుగురాళ్ల‌లో యరపతినేని భారీ క‌టౌట్‌ను ఏర్పాటు చేశారు. పిడుగురాళ్ల మునిసిప‌ల్ అధికారులు ఆ క‌టౌట్‌ను తొల‌గించాల‌ని య‌ర‌ప‌తినేని అనుచ‌రుల‌కు స్పష్టంచేశారు. య‌ర‌ప‌తినేని అనుచ‌రులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసు బ‌ల‌గాల‌తో క‌లిసి మునిసిప‌ల్ అధికారులు క‌టౌట్‌ను తొల‌గించేందుకు య‌త్నించారు. దీంతో అక్క‌డ‌కు చేరుకున్న య‌ర‌ప‌తినేని అనుచ‌రులు పోలీసులు, మునిసిప‌ల్ అధికారులను అడ్డుకున్నారు.

high tension in palnadu:police want remove yarapatinani flexi

ఇరువ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. పోలీసులు, అధికారుల‌ను నిలువ‌రించే య‌త్నంలో భాగంగా య‌ర‌ప‌తినేని అనుచ‌రుల్లో కొంద‌రు వ్య‌క్తులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. పోలీసులు వెనుదిర‌గ‌క‌పోతే నిప్పు అంటించుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఊహించ‌ని ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. దీంతో ఏం చేయాలో వారికి తెలియలేదు. వారిని ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా కటౌట్ తీయమని భీష్మించుకొని కూర్చొన్నారు.

అసలే కేబినెట్ ఏర్పాటులో అధికార పార్టీ మునిగిపోయింది. అసంతృప్తులను చల్లబరిచే ప్రయత్నాలను కూడా చేస్తున్నారు. ఇంతలో లోకల్ పాలిటిక్స్ పల్నాడులో హీట్ పుట్టించాయి. పోలీసులు తమపై కక్ష సాధింపు చర్యలకు దిగారని అంటున్నారు. తమ కటౌట్ తీయాలని చూడటం వేధింపులే అని చెబుతున్నారు. మరీ మిగతావారికి ప్లెక్సీలకు ఎలా అనుమతిస్తారని అడుగుతున్నారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+