Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుంటూరు వైసీపీలో మార్పుల టెన్షన్- సత్తెనపల్లికి ఆర్కే మార్పు! మంగళగిరి టికెట్ కోసం బీసీల రేస్ !

ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తున్న వైసీపీ అధిష్టానం గుంటూరు జిల్లాల్లో చేస్తున్న మార్పులు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి పోటీగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను అదనపు ఇన్ ఛార్జ్ గా నియమించడంతో మొదలైన ఈ ప్రయోగం.. మంగళగిరి, సత్తెనపల్లితో పాటు పలు నియోజకవర్గాల్లో తప్పేలా లేదు. దీంతో మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి టికెట్ కోసం బీసీల పోరు మొదలైంది.

గుంటూరు వైసీపీలో కాక

గుంటూరు వైసీపీలో కాక


గుంటూరు వైసీపీలో అధిష్టానం చేపడుతున్న మార్పులు కాక రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీని ఈసారి కచ్చితంగా అధికారంలోకి తెచ్చేందుకు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను నియోజకవర్గాలు మార్చాలని జగన్ భావిస్తుండటంతో పలు చోట్ల దీనిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమరావతి పరిధిలోకి వచ్చే తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి స్ధానంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ను రంగంలోకి దింపిన జగన్.. ఇదే క్రమంలో సత్తెనపల్లి, మంగళగిరిలోనూ మార్పులు చేపట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.దీంతో ఆయా స్ధానాల్లో కొత్తగా వచ్చే అభ్యర్ధులపై చర్చ జరుగుతోంది.

అవనిగడ్డకు అంబటి రాంబాబు

అవనిగడ్డకు అంబటి రాంబాబు


తాజా మార్పుల్లో భాగంగా సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అంబటి రాంబాబును ఈసారి అక్కడి నుంచి కాకుండా కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి తరహాలోనే అవనిగడ్డలోనూ కాపు జనాభా ఎక్కువగానే ఉండటం, అవనిగడ్డ కూడా వైసీపీ సిట్టింగ్ స్ధానమే కావడంతో అక్కడికి అంబటిని మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా మారి వేరే నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అంబటి అయిష్టంగా ఉన్నట్లు సమాచారం. అయినా జగన్ చెబితే పోటీ చేయక తప్పుతుందా..

సత్తెనపల్లికి ఆర్కే మార్పు

సత్తెనపల్లికి ఆర్కే మార్పు

అలాగే మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి సత్తెనపల్లికి మార్చాలని అధిష్టానం భావిస్తోంది. అమరావతిలో మారుతున్న పరిస్ధితులు, ఆళ్లకు పెరుగుతున్న వ్యతిరేకత తట్టుకోవాలంటే తమ సిట్టింగ్ స్ధానమైన సత్తెనపల్లి నుంచి బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ప్రకటన రాకపోయినా అధిష్టానం ఆలోచన మేరకు సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగేందుకు ఆళ్ల రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. స్ధానికంగా నెలకొన్న బీసీల పోరు, అమరావతి సమస్య నేపథ్యంలో మంగళగిరి కంటే సత్తెనపల్లి అయితేనే బెటరని ఆర్కే భావిస్తున్నట్లు అర్దమవుతోంది.

మంగళగిరిలో బీసీల మధ్య రేసు ?

మంగళగిరిలో బీసీల మధ్య రేసు ?

మంగళగిరిలో ఆర్కే పోటీ నుంచి తప్పుకుని సత్తెనపల్లికి మారే అవకాశం ఉండటంతో ఈసారి తమకు కచ్చితంగా టికెట్ వచ్చి తీరుతుందని ఇక్కడి బీసీ నేతలు భావిస్తున్నారు. దీంతో మంగళగిరిలో ఇప్పటికే వైసీపీలో ఉన్న నేతల మధ్య టికెట్ పోరు పెరుగుతోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న బీసీలు ఎమ్మెల్సీ హనుమంతరావు, చిల్లపల్లి మోహనరావు, కాండ్రు కమల వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందన్నది తేలాల్సి ఉంది. తాజాగా టీడీపీని వీడిన గంజి చిరంజీవిని సైతం వైసీపీలోకి తీసుకొచ్చి టికెట్ అవకాశాలు లేకపోలేదు. దీంతో ఈ నలుగురు బీసీ నేతల మధ్య టికెట్ పోరు తప్పేలా లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+