గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వక్ర బుద్ధి మారడం లేదు,‘సైబరాబాద్’ ఎందుకు తీసుకోలేదు?: లోకేష్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాజధాని విషయంలో బోస్టన్ కమిటీ సమర్పించిన నివేదికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అది బోస్టన్ రిపోర్టు కాదు.. బోగస్ రిపోర్టు అని ఆయన ఎద్దేవా చేశారు.

 మొనగాడు జగన్ వచ్చి.. చేస్తున్నారట!: 'ఫేక్’ బతుకంటూ నారా లోకేష్ తీవ్ర విమర్శలు మొనగాడు జగన్ వచ్చి.. చేస్తున్నారట!: 'ఫేక్’ బతుకంటూ నారా లోకేష్ తీవ్ర విమర్శలు

రైతుల కంట కన్నీరు మంచిది కాదు..

రైతులపై వైఎస్ జగన్ గారికి అంత కక్ష ఎందుకో అర్ధం కావడం లేదు. అర్దరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయబ్రాంతులకు గురిచేసి ఏమి సాదించాలి అనుకుంటున్నారు. అర్దరాత్రి రైతుల ఇళ్లలో సోదాలా? అని లోకేష్ ప్రశ్నించారు. రాజధాని కోసం శాంతియుతంగా పోరాడుతున్న రైతుల పట్ల జగన్ గారి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు జగన్ గారు అంటూ హితవు పలికారు లోకేష్.

బోగస్ రిపోర్టుతో బట్టబయలు..

అది బోస్టన్ రిపోర్ట్ కాదు. జగన్ బోగస్ రిపోర్ట్. అమరావతిని చంపేయాలన్న దురుద్దేశంతో గత ఐదేళ్లలో వైఎస్ జగన్ గారి రాసిన స్క్రిప్ట్ నే మరోసారి బోగస్ రిపోర్ట్ పేరుతో బయటపెట్టారని లోకేష్ ధ్వజమెత్తారు.

సైబరాబాద్ గురించి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు?

సైబరాబాద్ గురించి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు?

పెరిగే జనాభా అవసరాలకు తగ్గట్లుగా పెద్దపెద్ద నగరాల శివార్లలో అభివృద్ది చేసిన సాటిలైట్ సిటీలు,టెక్నాలజీ హబ్ లు, అర్బన్ టౌన్ షిప్ లను గ్రీన్ సిటిలుగా చూపించి అవన్నీ ఫెయిల్ అయ్యాయని చెప్పడాన్ని బట్టే ఈ బిసిజి రిపోర్ట్ చిత్తశుద్ది ఏంటో అర్ధం అవుతుంది. అన్ని నగరాల గురించి చెప్పిన రిపోర్టులో సంవత్సరానికి లాక్షా ముప్పై వేల కోట్ల ఆదాయం వస్తున్న గ్రీన్ ఫీల్డ్ సిటీ అయిన సైబరాబాద్ ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? రాజధాని ఏర్పాటుకు అమరావతి అనువైన ప్రాంతం అని చట్టబద్ధత ఉన్న శివ రామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.

అయినా జగన్ వక్రబుద్ధి మారడం లేదు..


అమరావతి ముంపుకి గురవుతుంది, భూమి స్వభావం వలన నిర్మాణ వ్యయం పెరుగుతుంది అంటూ అసత్య ఆరోపణలు చేసి కోర్టుకెళ్లి మొట్టికాయలు తిన్నారు.
అయినా జగన్ గారి వక్ర బుద్ధి మారలేదు.కోర్టులు చివాట్లు పెట్టిన అంశాలనే రిపోర్టులో పెట్టి అది బోగస్ రిపోర్ట్ అని జగన్ గారే స్వయంగా ప్రకటించారు.(4/5)

ముంచడం జగన్‌కు అలవాటేనంటూ.

ముఖ్యమంత్రి, మంత్రుల స్టేట్ మెంట్లనే కమిటీ రిపోర్టులుగా ఇచ్చారు. జిఎన్ రావు, బోస్టన్ రిపోర్ట్ ల విశ్వసనీయత ఏంటో న్యాయస్థానాల ముందు తేలిపోతుంది. కన్సల్టింగ్ కంపెనీలను ముంచడం జగన్ గారికి అలవాటేగా! అంటూ లోకేష్ మండిపడ్డారు.

English summary
TDP leader Nara Lokesh hits out at ys jagan for boston report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X