గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహామేత-యువమేత! YSPappubatch.: వైఎస్సార్, వైఎస్ జగన్‌పై లోకేష్ ఘాటు విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ఏపీ సర్కారు తీరుపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.

అధికార వైసీపీ మసే: గుడ్డి ప్రభుత్వానికి అమరావతిలో ఏదీ కనిపించదు: నారా లోకేష్ సవాల్అధికార వైసీపీ మసే: గుడ్డి ప్రభుత్వానికి అమరావతిలో ఏదీ కనిపించదు: నారా లోకేష్ సవాల్

మహామేత అంటూ..

''మహామేత'' అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించారు. ఏమైంది? అంటూ దివంగత సీఎం వైఎస్సార్‌ను ఉద్దేశించి నారా లోకేష్ ప్రశ్నించారు.

ఆ విచారణలు ఏమయ్యాయి?

గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటికి, ఈడీ కి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు. ఏమైంది? అని నారా లోకేష్ నిలదీశారు.

యువమేత ఆత్రం అంటూ..

‘ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారు. అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి విచారణ చెయ్యాల్సిన పోలీసులతో ? ఇక్కడే అర్ధం అవుతుంది, ''యువమేత'' ఆత్రం. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్ లతో కాలక్షేపం చెయ్యడమే..'అంటూ నారా లోకేష్ దుయ్యబట్టారు.

వైఎస్ పప్పుబ్యాచ్ అంటూ..

వైఎస్ పప్పుబ్యాచ్ అంటూ..


అంతేగాక, ఈ ట్వీట్లకు వార్త పత్రికల్లో వచ్చిన న్సూస్, సిట్‌కు సంబంధించిన జీవోను నారా లోకేష్ జతచేశారు. ఇక లోకేష్ తన ట్వీట్లకు #YSPappubatch అనే హాష్‌ట్యాగ్ తగిలించారు. కాగా, ఇటీవల కాలంలో నారా లోకేష్ తన వైఎస్ జగన్ సర్కారుపై విమర్శల దాడిని పెంచడం గమనార్హం. ఇక టీడీపీ నుంచి బుద్ధా వెంకన్న, వైసీపీ నుంచి ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

English summary
TDP leader Nara Lokesh slams ys jagan govt for it raids and sit issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X