• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలి!!

|
Google Oneindia TeluguNews

మనం చేతిలో ఏదైనా వస్తువును కోల్పోతే అది ఎక్కడ పడిపోయిందో గుర్తుంచుకొని అక్కడ వెతుకుతాం.. దొరుకుతుంది. అంటే ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలి. ఈ మాట ప్రస్తుత రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఏదైనా నియోజకవర్గంలో ఓటమిపాలైతే తిరిగి అక్కడే గెలవాలని ప్రతి రాజకీయ నేత బలంగా ఆకాంక్షిస్తారు. అందుకు ఉదాహరణ నారా లోకేష్. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓటమిపాలైన ఆయన అక్కడి నుంచే తిరిగి విజయం సాధించాలనే దృక్పథంతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

1985లో తొలి గెలుపు.. చివరి గెలుపు

1985లో తొలి గెలుపు.. చివరి గెలుపు

వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చివరి సారిగా 1985లో గెలుపొందింది. గెలవడం కూడా అదే మొదటిసారి. పొత్తుల్లో భాగంగా ఆ సీటును సీపీఎంకు కేటాయించేవారు. ఒకరకంగా చూస్తే టీడీపీ అక్కడ గెలవడానికి పెద్దగా అవకాశం లేదు. వరుసగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్న నియోజకవర్గంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో 12 ఓట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 5వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైంది.

వేరే నియోజకవర్గం లేదు.. అక్కడే పోటీ

వేరే నియోజకవర్గం లేదు.. అక్కడే పోటీ

ఇటీవలే బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఈసారి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉందని, అక్కడినుంచే పోటీచేయబోతున్నట్లు తెలిపారు. రెండో నియోజకవర్గం ఊసే లేదన్నారు. గత ఎన్నికల్లో రాజధాని పరిధిలోని నియోజకవర్గం కావడంతో ప్రజలు టీడీపీని కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకంతో పోటీచేశానన్నారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో తరుచుగా పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామాన్ని చుట్టిరావాలనేది లోకేష్ లక్ష్యంగా ఉంది. అన్న క్యాంటిన్ తోపాటు ఒక వెహికల్ లో మొబైల్ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన వైద్యపరీక్షలను నిర్వహిస్తోంది.

నాయకులు వెళ్లినా కార్యకర్తలు వెళ్లరు

నాయకులు వెళ్లినా కార్యకర్తలు వెళ్లరు


2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన గంజి చిరంజీవి ఇటీవలే వైసీపీలో చేరారు. పార్టీ చేనేత విభాగానికి ఆయన్ని అధ్యక్షుడిగా జగన్ నియమించారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ నాయకులు వెళ్లినంతమాత్రాన క్యాడర్ వెళ్లదని, వారంతా తనవెంటే ఉంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాజధానిని ఇక్కడి నుంచి తరలించే అంశం వైసీపీకి నష్టం చేకూరుస్తుందని, తనకు అనుకూలంగా మారుతుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. మంగళగిరిలో కచ్చితంగా విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాలనే యోచనలో ఉన్నారు.

English summary
Nara Lokesh, who recently participated in the Balakrishna Unstoppable program, said that he is confident that the people of Mangalagiri constituency will support him this time and that he is going to contest from there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X