కోడెల కుటుంబానికి మరో షాక్ : ద్విచక్ర వాహన డీలర్ షిప్ రద్దు..!!
వరుస వివాదాలతో సతమతం అవుతున్న మాజీ స్పీకర్ కోడెల కుటుంబానికి మరో షాక్ తగిలింది. నిబంధనలకు వ్యతిరేకంగా ద్విచక్ర వాహనాలను విక్రయించారనే కారణంతో రవాణా శాఖ అధికారులు కోడెల కుమారుడికి చెందిన గౌతం ఆటోమోటివ్స్ లైసెన్సు తో పాటుగా డీలర్ షిప్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. షోరూమ్ సీజ్ చేయడంఅక్రమం అంటూ కోర్టు కెళ్లారు. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారం పైన రగడ పూర్తి కాకముందే ఇప్పుడు ఆర్టీఏ అధికారులు తీసుకున్న నిర్ణయం పైన కోడెల కుటుంబం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.
శివరామకృష్ణ ఆటోమోటివ్స్ లైసెన్సు రద్దు..
కొంత కాలంతా వరుస వివాదాల్లో చిక్కుకున్న మాజీ స్పీకర్ కోడెల కుటుంబానికి ఆర్టీఏ అధికారులు మరో షాక్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం కోడెల కుమారుడు గుంటూరు లో నిర్వహిస్తున్న గౌతం ఆటోమోటివ్స్ లో నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలను వినియోగదారులకు విక్రయాలు చేసినట్లుగా గుర్తించారు. దీంతో..అప్పుడు ఆర్టీఏ అధికారులు నోటీసులు జారీ చేసారు. దీని పైన కోడెల కుమారుడు శివరాం కోర్టును ఆశ్రయించారు. అయితే, తాజాగా గుంటూరు రవాణా శాఖ అధికారులు శివరాంకు చెందిన గౌతం ఆటోమోటివ్స్ లైసెన్సు..డీలర్ షిప్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీఏ చట్టాలను ఉల్లంఘిస్తూ 576 వాహనాలను అక్రమంగా అమ్మకాలు చేసారని విచారణలో ఆర్టీఏ అధికారులు తేల్చారు. నిబంధనల ఉల్లంఘనతో కోడెల శివరామకృష్ణ కు చెందిన గౌతంఆటోమోటివ్ డీలర్ షిప్ రద్దు చేస్తున్నటు నోటీస్ జారి చేసారు ఆర్టీఏ అధికారులు. గౌతం ఆటోమోటివ్స్ అక్రమాలను హీరో మోటర్స్ కు కూడా సాక్ష్యాధారాలను ఆర్టీఏ అధికారులు అందించారు.

కోడెలకు దెబ్బ మీద దెబ్బ..
ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత మాజీ స్పీకర్ కోడెలకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అసెంబ్లీ అధికారులు కోడెల తనయుడి షో రూంలో అసెంబ్లీ ఫర్నీచర్ ను గుర్తించి..స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు రాత్రి మానసిక ఒత్తిడి తో కోడెలకు స్వల్ప గుండెపోటు వచ్చింది. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో రాజకీయంగానూ అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఇక, ఇప్పుడు కోడెల కుమారుడి ద్విచక్ర వాహన షోరూంను సీజ్ చేయటం ద్వారా మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే కోడెల కుమారుడు.. కుమార్తె పైన అనేక ఫిర్యాదులు ఉన్నాయి. టీడీపీలోన కోడెల కుటుంబం.. వస్తున్న ఆరోపణల పైన చర్చ సాగుతోంది. పార్టీ నుండి మద్దతు కరువైంది. ఇక, రాజకీయంగా తమను వేధిస్తున్నారని కోడెల ఆరోపించారు. అయితే, ప్రభుత్వం మాత్రం కోడెల వ్యవహారం మీద ఎక్కడా అధికారికంగా స్పందించటం లేదు. ఇప్పుడు షోరూం సీజ్ వ్యవహారం పైన కోడెల కుటుంబ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications