సంగం డెయిరీ కేసు : ధూళిపాళ్ళ నరేంద్ర కస్టడీ పొడిగించేది లేదన్న ఏసీబీ కోర్టు, బెయిల్ పిటీషన్ పై విచారణ

సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రిమాండ్లో ఉన్న టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర కస్టడీని పొడిగించేది లేదని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తేల్చి చెప్పింది. సంగం డెయిరీ కేసులో దూళిపాళ్ల వేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కోర్టుపై వ్యాఖ్యలు చేసింది.

సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో టిడిపి సీనియర్ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తనపై ఏసీబీ అధికారులు పెట్టిన కేసును కొట్టివెయ్యాలని ధూళిపాళ్ళ నరేంద్ర ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చెయ్యగా ఆ పిటీషన్ ఏపీ హైకోర్టు కొట్టేసింది. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న ధూళిపాళ్ళ నరేంద్రను సంగం డెయిరీ వ్యవహారాలలో మరింత లోతుగా విచారించాలని ఏసీబీ అధికారులు కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలో ఏసీబీ కోర్టు సైతం ధూళిపాళ్ళ నరేంద్రను కస్టడీకి ఇచ్చింది.

Sangam dairy case : ACB court ruled there is no extension of Dhulipalla Narendras custody

అయితే తాజాగా ధూళిపాళ నరేంద్ర కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో విచారణ జరపలేకపోతున్నామని,ఆయన కస్టడీని మరింత పొడిగించాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు.కరోనా పాజిటివ్ కారణంగా ధూళిపాళ్ళ నరేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నందున విచారణ పూర్తి కాలేదని, మరో వారంరోజుల పాటు కస్టడీని పొడిగించాలని ఏసీబీ అధికారులు కోరడంతో స్పందించిన న్యాయస్థానం రేపటితో ఆయన కస్టడీ ముగియనుందని, ఈ సమయంలో మళ్ళీ కస్టడీ వీలు కాదని స్పష్టం చేసింది. కస్టడీ పొడిగింపు చేసేది లేదని పేర్కొంది. ప్రస్తుతం కరోనా బారినపడిన ధూళిపాళ్ల నరేంద్ర విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+