గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పటంలో వైఎస్ఆర్ విగ్రహాం కూడా తొలగింపు, పవన్ పర్యటన తర్వాత..

|
Google Oneindia TeluguNews

ఇప్పటంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ఇదివరకే ప్రముఖుల విగ్రహాలను తీసివేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ స్టాచ్యూ కూడా తీసేశారు. 120 అడుగుల రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూలుస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై స్థానికులు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

అంతకుముందు గ్రామస్తులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.

రోడ్డు పక్కన గల మహాత్మా గాంధీ, నెహ్రూ, అబ్దుల్ కలాం విగ్రహాలను కూడా అధికారులు తొలగించారు. పక్కనే గల రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నిన్నటి వరకు కూల్చలేదు. అన్నీవైపుల నుంచి విమర్శలు రావడంతో కూల్చివేశారు. జనం మాత్రం ప్రభుత్వంపై ఆగ్రహాంతోనే ఉన్నారు. రోడ్డును పెంచితే.. తమ గూడును తొలగించాలా అని ఫైర్ అవుతున్నారు.

officials are removed ysr statue from ippatam village

ఇప్పటంలో పవన్ కల్యాణ్ పర్యటించిన సమయంలో వైఎస్ విగ్రహానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ రెండంచెల ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు విగ్రహానికి కాపలా కాశారు. పవన్ కల్యాణ్‌కు భద్రతగా ఉండాల్సిన పోలీసులు వైఎస్ విగ్రహానికి సెక్యూరిటీ ఇచ్చారని విమర్శలు వచ్చాయి. దీంతో ఇవాళ వైఎస్ విగ్రహాన్ని కూడా తీసివేశారు.

ఇప్పటంలో రోడ్డు విస్తరణ పనులపై ప్రజల నుంచి నిరసన వచ్చింది. రోడ్డు విస్తరణకు అడ్డొచ్చిన ఇళ్లలో ఓ వైపు మొత్తం కూల్చివేశారు. దీనిపై గ్రామస్థులు కోర్టుకు ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత గ్రామానికి వచ్చిన పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించారు. పేదల ఇళ్లను కూల్చేసిన ప్రభుత్వం కూడా కూలిపోతుందని పవన్ మండిపడ్డారు. గ్రామస్తల నిరసన, పవన్ పర్యటనతో గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
officials are removed ysr statue from ippatam village
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X