Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టైగర్ కా హుకూం: పల్నాడు గడ్డపై మీసం మెలేసిన నెల్లూరు బిడ్డ

Anil Kumar Yadav: పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ స్థానానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతోన్న మాజీ మంత్రి, నెల్లూరు సిటీ సిట్టింగ్ శాసన సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. పల్నాడు గడ్డపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నరసరావుపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలోఈ స్థానంలో అనిల్ కుమార్ యాదవ్‌ పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. నెల్లూరు సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి మైనారిటీ నేత ఖలీల్‌కు టికెట్ ఇవ్వనున్నారు.

ఈ మధ్యాహ్నం నెల్లూరు నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు అనిల్ కుమార్ యాదవ్. పదుల సంఖ్యలతో కార్లతో ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ఆయనకు బ్రహ్మరథం పట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. పలుచోట్ల అభిమానులకు అభివాదం చేస్తూ సాగారు. రాత్రి నరసరావుపేటకు చేరుకున్నారు.

మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరు నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి.. ఇతర నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నరసరావుపేట బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారాయన. వందలాది మంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

Anil Kumar Yadav

నెల్లూరు సిటీలో ఎప్పుడూ లేని విధంగా ఓ మైనారిటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టికెట్ ఇచ్చారని, అలాగే నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి బీసీ నాయకుడినైన తనకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. పల్నాడు ప్రజల గౌరవం, ఈ ప్రాంత పౌరుషం తగ్గనివ్వబోనని హామీ ఇచ్చారు.

నెల్లూరులో ఉన్నన్ని రోజులూ మీసం తిప్పడానికి సంకోచించే వాడినని, పల్నాడు గడ్డ మీద స్వేచ్ఛగా మీసం తిప్పుతాననీ అన్నారు. పల్నాడు గడ్డ ప్రతిష్ఠను ఢిల్లీ స్థాయిలో పెంచుతానని చెప్పారు. అదే సమయంలో ఈ ప్రాంతం అభివృద్ధి గురించి దేశ రాజధానిలో మాట్లాడేలా పని చేస్తానని అన్నారు.

పైన ఆ దేవుడిని, కింద తాడేపల్లిలో ఉన్న జగన్‌ అనే దేవుడిని తాను నమ్ముకున్నానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ చెబితే నరసరావుపేట మాత్రమే కాదు.. వైసీపీ ఖచ్చితంగా ఓడిపోయే స్థానంలో అయినా సరే పోటీ చేసి తీరుతానని పేర్కొన్నారు.

జగన్.. తనకు రాజకీయ భిక్ష పెట్టాడని, తల తెగి కిందపడే నియోజకవర్గంలో అయినా సరే పోటీ చేయమంటే చేస్తానని చెప్పారు. జగన్ ఏది చెబితే అది టైగర్ కా హుకూం అని సిద్ధమైపోతానని స్పష్టం చేశారు. లోక్‌సభలో పల్నాడు ప్రాంత ప్రజల గళాన్ని వినిపిస్తానని అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+