Goa elections: బీజేపీకి రెబల్స్ బెడద; పనాజీతో సహా నాలుగు చోట్ల టెన్షన్ పెడుతున్న స్వతంత్రులు

గోవా ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ రెబెల్స్ బెడద ను ఎదుర్కోనుంది. గోవా అసెంబ్లీ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసి మళ్లీ గోవాను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి, టికెట్ నిరాకరించడంతో పార్టీని వీడి వెళ్లిన నేతలు రెబెల్స్ గా ఎన్నికల బరిలోకి దిగడంతో తలనొప్పి మొదలైంది. ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీ చాలా ప్రాంతాల్లో అసమ్మతిని నియంత్రించగలిగింది. అయితే ప్రతిష్టాత్మకమైన పనాజీ నియోజకవర్గంతో సహా నాలుగు స్థానాలు మాత్రం బీజేపీకి ఆందోళన కలిగిస్తున్నాయి.

పనాజీ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా ఉత్పల్ పారికర్

పనాజీ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా ఉత్పల్ పారికర్

పనాజీలో మాజీ ముఖ్యమంత్రి , దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. 2019లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన అధికార పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ నేతల పార్టీ ఫిరాయింపులలో కీలక భూమిక పోషించిన అటానాసియో మోన్సెరట్టెను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించటంతో ఆయనపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఉత్పల్ పారికర్ తన హృదయం బిజెపితో కొనసాగుతుందని పేర్కొన్నాడు. అయితే అతను ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్నానని అందుకే ఎన్నికల బరిలోకి దిగుతున్నానని వెల్లడించారు.

మాండ్రెమ్‌లో ఇండిపెండెంట్ గా మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్

మాండ్రెమ్‌లో ఇండిపెండెంట్ గా మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్

పనాజీలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన ఉత్పల్ పారికర్ మోన్సెరేట్‌పై గతంలో నమోదైన తీవ్రమైన కేసులను టార్గెట్ గా చేసుకుని ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన బిజెపికి తలనొప్పిగా మారారు. మాండ్రెమ్‌లో, బిజెపి మేనిఫెస్టో కమిటీ హెడ్‌గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, పార్టీని విడిచిపెట్టి, 2017లో కాంగ్రెస్‌వాదిగా తనను ఓడించిన దయానంద్ సోప్టేపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

సంగెం నుండి చంద్రకాంత్ కవ్లేకర్ భార్య సావిత్రి కవ్లేకర్ పోటీలో

సంగెం నుండి చంద్రకాంత్ కవ్లేకర్ భార్య సావిత్రి కవ్లేకర్ పోటీలో

సంగెంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్ భార్య సావిత్రి కవ్లేకర్ తిరుగుబాటు చేసి అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుభాష్ ఫాల్దేశాయ్‌పై పోటీ చేశారు. చంద్రకాంత్ కవ్లేకర్ బిజెపి అభ్యర్థిగా ఉన్న క్యూపెమ్ అసెంబ్లీ స్థానానికి సమీపంలో ఉన్న నియోజకవర్గం సంగేమ్. ప్రస్తుత సభలో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రసాద్ గాంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు.

 కుంభార్జువా నుండి బీజేపీకి ఇండిపెండెంట్ బెడద

కుంభార్జువా నుండి బీజేపీకి ఇండిపెండెంట్ బెడద

కుంభార్జువాలో, అధికార పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కుమారుడు సిద్ధేష్ నాయక్‌ను బిజెపి శాంతింపజేసింది. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే పాండురంగ్ మద్కైకర్ భార్య జైనితా మద్కైకర్, కుంభార్జువా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె మాజీ సహచరుడు రోహన్ హర్మల్కర్‌ పై పోటీ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా బిజెపి గోవా ఎన్నికలలో చాలామంది అసంతృప్తులను శాంతింప చేసినప్పటికీ నాలుగు చోట్ల రెబల్స్ బెడద పొంచి ఉంది.

గోవాలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు

గోవాలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు

ఇదిలా ఉంటే గోవా రాష్ట్రంలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధాన పార్టీలన్నీ గోవా ఎన్నికలను భావిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఓటర్ల మద్దతు కూడగట్టడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా కారణంగా ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల నేపధ్యంలో ప్రచారానికి కొత్త మార్గాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+