పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఉదయం 9.30 గంటలకు ఎగ్జామ్
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు జరగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. టెన్త్ పరీక్షల కోసం విద్యాశాఖ పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గతంలో 11 పేపర్లు ఉండగా ఈ సారి ఆరు పేపర్లకు కుదించారు.

17వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 18వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. 19వ తేదీన ఇంగ్లీష్, 20వ తేదీన మ్యాథ్స్, 21వ తేదీన సైన్స్, 22వ తేదీన సోషల్ పరీక్షను నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో కొవిడ్-19 నిబంధనలను పాటించాల్సి ఉంది. 24వ తేదీన సంస్కృత్/ అరబిక్ పేపర్-1, 25వ తేదీన సంస్కృత్/ అరబిక్ పేపర్-2 నిర్వహిస్తారు. 26వ తేదీన వొకేషనల్ కోర్సుకు పరీక్ష ఉంటుంది.












Click it and Unblock the Notifications