రూ.112.98 కోట్లు: 20 రోజుల్లో చలానా ద్వారా వచ్చిన మొత్తం..
పెండింగ్ చలానాలపై 75 శాతం రాయితీ ఇవ్వడంతో అందరూ కట్టేస్తున్నారు. దీంతో చలాన్లు దాదాపుగా క్లియర్ అవుతున్నాయి. ఈ నెల చివరి వరకు అవకాశం ఉన్నా.. వాహనాదారులు మాత్రం కడుతూనే ఉన్నారు. ట్రాఫిక్ చలాన్ క్లియర్ కావడంతో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నిధులు వస్తోన్నాయి. రాయితీకి మంచి స్పందన వస్తోంది.

3 కమిషనరెట్లే..
మార్చి1 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనరేట్ల పరిధి లో 1.2 కోట్లు చలాన్లు క్లియర్ అయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 112.98 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 63 లక్షల చలాన్లు క్లియర్ కాగా.. వీటి ద్వారా రూ.49.6 కోట్లు వాహనదారులు చెల్లించారు. సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో 38 లక్షల చలాన్లు క్లియర్ కాగా.. వీటి ద్వారా రూ.45.8 కోట్లు ఆదాయం వచ్చింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16 లక్షల చలాన్లు క్లియర్ కాగా రూ. 15.3 కోట్లు ఆదాయం లభించింది.

రాయితీ
కరోనా సమయం.. పేద, మధ్య తరగతి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెండింగ్ చలాన్లపై రాయితీలు ప్రకటించారు. బైకులు 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని.. 75% చలాన్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌కు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకి 80 శాతం రాయితీ కల్పించారు.
రాయితీ ప్రకటించిన తొలిరోజు రూ.7 లక్షలకు పైగా చలానాలు క్లియర్ కాగా, రూ.7.5 కోట్లు వసూల్ అయ్యాయి. తొలి రోజు నమోదైన రికార్డును బద్దలు కొడుతూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్ చలాన్లు బిల్లులు చెల్లించడం రికార్డుగా మారింది. మొత్తం 10.5 లక్షల చలాన్లు క్లియర్ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.11 కోట్లు చేరాయి.

స్లో అండ్ స్టడీ
ఈ నెల 31 వరకు సమయం ఉన్న నేపథ్యంలో తొందర పడకుండా వాహనదారులు తమ పెండింగ్ చలాన్లు చెల్లించుకోవచ్చని సూచించారు. చలాన్లు చెల్లించిన వారిలో అధికంగా మూడు కమిషనరేట్లకు చెందిన వాహనాలే ఉన్నాయి.












Click it and Unblock the Notifications