హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒమిక్రాన్ హై టెన్షన్: ఇవాళ ఒకరోజే 14 కేసులు.. మొత్తం 38 కేసులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇవాళ మొత్తం 14 కేసులు వచ్చాయి. నిన్నటి వరకు మొత్తం కేసులు 24 ఉన్న సంగతి తెలిసిందే. 14 కేసులతో కలిపి 38కి చేరింది. 14 కేసులు విదేశాల నుంచి వచ్చినవారేనని తెలుస్తోంది. ప్రైమరీ కాంటాక్ట్ ట్రేస్ చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. వారికి టెస్ట్ చేసి.. నెగిటివ్ వస్తేనే వదులుతారు.

ఇటు హైదరాబాద్‌లో ఒకరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. కెన్యా నుంచి హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్‌ వైరస్ సోకింది. హయత్‌నగర్‌లో ఉన్న అతడిని వైద్యులు టిమ్స్‌కు తరలించారు. బాధితుడి కాంటాక్ట్‌ను గుర్తించి వైద్యులు టెస్టులు చేస్తున్నారు. ఈ కేసుతో కలిసి రాష్ట్రంలో ఒమిక్రాన్ సంఖ్య 25కు చేరింది.

14 omicron positive case found in telangana

తాజాగా నమోదైన కేసుతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కు చేరింది. ఒమిక్రాన్ సోకిన యువ‌కుడిని అధికారులు గ‌చ్చిబౌలి టిమ్స్‌కు త‌ర‌లించారు. ఆ యువ‌కుడి కాంటాక్ట్‌ల‌ను గుర్తించి శాంపిళ్ల‌ను ఆరోగ్య శాఖ అధికారులు సేక‌రిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దేశంలో 213 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు ఉండగా ఆ తర్వాత ఢిల్లీలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల్లో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది.

ఇటు టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించామని నిన్న తెలిపారు. మిగతా వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఒమిక్రాన్‌ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్‌ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే రోజుకు 48 శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని వైద్యారోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. యూరప్‌లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అమెరికాలో సైతం ఈ రకం కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఒకరు చనిపోయారు కూడా.

English summary
14 omicron positive cases found in telangana state. they all are foreigners
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X