Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు.. మరో 7 మంది మృతి...

తెలంగాణలో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 831 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 7 మంది కరోనాతో మృతి చెందారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం (అక్టోబర్ 16) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,19,224కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1256కి చేరింది. ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 19,251 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 1,435మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,94,653 కి చేరింది.

 1554 new coronavirus cases and 7 deaths reported from telangana

గడిచిన 24గంటల్లో మొత్తం 43,916 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 37,46,963కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 87,092 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.57శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 87.5శాతం ఉండగా తెలంగాణలో 88.79శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 249 కేసులు నమోదవగా... రంగారెడ్డి జిల్లాలో 126,మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 118 కేసులు నమోదయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+